CM Jagan : లండన్‌ నుంచి తిరిగొచ్చిన వెంటనే ఢిల్లీకి సీఎం జగన్ .. చంద్రబాబు అరెస్ట్ తరువాత హస్తిన పర్యటనలో ఆంతర్యమేంటీ..?

లండన్ నుంచి సీఎం జగన్ తిరిగొచ్చారు. రేపు ఢిల్లీ వెళతారని సమాచారం. చంద్రబాబు అరెస్ట్ తరువాత ఢిల్లీకి జగన్ పర్యటన ఉందనే విషయం ఆసక్తికరంగా మారింది.

CM JAGAN Delhi Tour

CM Jagan Delhi Tour : ఏపీలో ఎన్నికలు త్వరలోనే జరుగుతాయని వార్తలు వస్తున్న క్రమంలో రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. అటు సీఎం జగన్ లండన్ వెళ్లటం ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) అనంతరం రిమాండ్.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు వంటి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. చంద్రబాబు అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన మరునాడే సీఎం జగన్ లండన్ నుంచి తిరిగొచ్చారు. దీంతో ఏపీలో జరిగిన అన్ని పరిణామాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఆ పార్టీ నేతలతో పాటు అడ్వకేట్ జనరల్.

ఇదిలా ఉంటే లండన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. బుధవారం (సెప్టెంబర్ 13,20230న జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. హోం మంత్రి అమిత్ షా, ప్రధాని మోదీలో భేటీ కానున్నారు. వారితో చంద్రబాలు అరెస్ట్, జమిలి ఎన్నికలు వింటి కీలక విషయాలపై చర్చించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఏపీలో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయా..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

Akhilesh Yadav : చంద్రబాబు అరెస్ట్ చట్టవిరుద్ధం : అఖిలేశ్ యాదవ్

ఈ క్రమంలో చంద్రబాబు అరెస్ట్ అయిన వెంటనే జగన్ లండన్ నుంచి జగన్ తిరిగిరావటం వచ్చీరాగానే వెంటనే ఢిల్లీ పెద్దల్ని కలిసేందుకు వెళతారనే వార్తలు వస్తుంటంతో ఏపీలో రాజకీయ పరిణామాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. లండన్ నుంచి తిరిగి వచ్చిన జగన్ మంగళవారం (సెప్టెంబర్ 12,2023) ఉదయం గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో రేపు అంటే 13న ఢిల్లీ పర్యటనకు వెళ్లి ప్రధాని మోదీ, అమిత్ షాలను కలవబోతున్నట్లు సమాచారం. లండన్ నుంచి రాగానే సీఎం వైఎస్ జగన్ హస్తిన పర్యటన ఆసక్తికరంగా మారింది.

Balakrishna : చంద్రబాబును జైల్లో పెట్టేందుకే స్కామ్‌ను క్రియేట్ చేశారు : ఎమ్మెల్యే బాలకృష్ణ