కార్టోశాట్-3 లాంచ్.. నవంబర్ 27కు వాయిదా: ఇస్రో

  • Published By: sreehari ,Published On : November 21, 2019 / 09:22 AM IST
కార్టోశాట్-3 లాంచ్.. నవంబర్ 27కు వాయిదా: ఇస్రో

Updated On : November 21, 2019 / 9:22 AM IST

భారత అంతరిక్షా పరీశోధన సంస్థ (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్టోగ్రఫీ శాటిలైట్ కార్టోశాట్-3 ప్రయోగాన్ని వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం.. కార్టోశాట్-3 ప్రయోగాన్ని నవంబర్ 25న ఉదయం 9.28 గంటల ప్రాంతంలో ప్రయోగించాల్సి ఉంది. కానీ, ఈ ప్రయోగాన్ని ఇస్రో రీషెడ్యూల్ చేసింది. కార్టోగ్రఫీ శాటిలైట్ ను మోసకెళ్లే PSLV-C47 ప్రయోగాన్ని నవంబర్ 27 ఉదయం 9.28 గంటలకు వాయిదా వేసింది. తేదీ మాత్రమే మారినా అదే సమయంలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. 

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAR) నుంచి రెండో ప్రయోగంలో భాగంగా కార్టోశాట్-3 శాటిలైట్ ప్రయోగించనుంది. కార్టోశాట్-3 ప్రయోగాన్ని ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చింది అనేదానిపై ఇస్రో ఇప్పటివరకూ ఎలాంటి కారణాలు వెల్లడించలేదు. PSLV-C47 వెహికల్ మోసకెళ్లే కార్టోశాట్-3 శాటిలైట్ సహా  అమెరికాకు చెందిన 12 నానో శాటిలైట్లను కూడా ఇస్రో ప్రయోగించనుంది. 

ఇటీవలే కార్టోశాట్-3ను వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నవంబర్ 25న ప్రయోగించనున్నట్టు ఇస్రో ట్వీట్ చేసింది. ఈ ప్రయోగ సమయంలో ఔత్సాహికులు ఎవరైనా వీక్షించాలనుకుంటే శ్రీహరికోటలోని గ్యాలరీ నుంచి కార్టోశాట్-3 ప్రయోగాన్ని వీక్షించవచ్చు. దీనికి రిజిస్ట్రేషన్లు నవంబర్ 20 నుంచి ఉదయం 8గంటల నుంచి ఓపెన్ అయి ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది.