Anil Ravipudi: జానర్ మార్చిన అనిల్ రావిపూడి.. కొత్త మూవీపై క్రేజీ అప్డేట్.. ఇద్దరు హీరోయిన్స్ ఫిక్స్
కామెడీ కాకుండా సరికొత్త జానర్ లో తన నెక్స్ట్ సినిమాను ప్లాన్ చేస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi).
Anil Ravipudi next movie crazy update.
- సరికొత్త జానర్ లో అనిల్ రావిపూడి కొత్త మూవీ
- స్పెషల్ రోల్ లో రానా దగ్గుబాటి
- హీరోయిన్స్ గా స్టార్స్ బ్యూటీస్
Anil Ravipudi: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కడ చూసిన దర్శకుడు అనిల్ రావిపూడి గురించే చర్చ నడుస్తోంది. ఇటీవల ఆయన మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు సినిమా చేసి బ్లాక్ బస్టర్ సాధించిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి ఏకంగా రీజనల్ సినిమాల్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పటికే మంచి కలక్షన్స్ రాబడుతోంది ఈ మూవీ. ఇప్పటికే ఈ సినిమా రూ.400 కోట్ల గ్రాస్ రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
అయితే, ఇప్పుడు అందరి దృష్టి దర్శకుడు అనిల్ రావిపూడిపైనే పడింది. కారణం ఏంటంటే, మన శంకర వరప్రసాద్ గారు లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ఆయన ఏ హీరోతో సినిమా చేస్తాడు అనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది. అయితే, ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు తన నెక్స్ట్ సినిమాకు సంబందించిన కథను ఆల్రెడీ లాక్ చేశాడట అనిల్. ఆయన ఇప్పటివరకు చేయని ఒక కొత్త జానర్ లో ఈ సినిమాను చేయబోతున్నాడట అనిల్ రావిపూడి(Anil Ravipudi).
Shashwat Sachdev: రామ్ చరణ్ సినిమాకు దురంధర్ మ్యూజిక్ డైరెక్టర్.. క్రేజీ కాంబో సెట్
అయితే, ఈ సినిమా కోసం మరోసారి విక్టరీ వెంకటేష్ ను హీరోగా ఎంచుకున్నాడట. దీనికి సంబందించిన కథ చర్చలు కూడా ఇప్పటికే జరిగాయని తెలుస్తోంది. అంతేకాదు, ఈ క్రేజీ ప్రాజెక్టులోఉన్న మరో విశేషం ఏంటంటే రానా కూడా కీ రోల్ చేయబోతున్నాడట. దీంతో, ఈ ప్రాజెక్టుపై అంచనాలు డబుల్ అవుతున్నాయి. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే, మహానటి కీర్తి సురేష్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నాడట.
అలాగే, గ్లామర్ బ్యూటీ పూజ హెగ్డే కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుందట. ఈ ఇద్దరు గ్లామర్ బ్యూటీల మధ్య వెంకటేష్ కనిపించే తీరు చాలా కొత్తగా ఉండనుందని సమాచారం అందుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాను కూడా అనుకున్నంత త్వరగా కంప్లీట్ చేసి 2027 సంక్రాంతి బరిలో దించాలని ప్లాన్ చేస్తున్నాడట అనిల్ రావిపూడి. మరి అనిల్ సంక్రాంతికి అదికూడా వెంకటేష్ తో వస్తున్నాడు అంటే మరో బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. మరి ఈసారి ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి మరి అనిల్.
