ఇండస్ట్రీలో మరో కొత్త హీరో.. ఆ ఫ్యామిలీ నుంచే..
మాదాల రవి కుమారుడు హీరోగా వస్తున్న కొత్త సినిమా 'ఓ టార్చర్ ప్రేమ(O Torture Prema)' ఫస్ట్ లుక్ విడుదల.
O Torture Prema movie first look poster released.
మాదాల రవి కుమారుడు హీరోగా కొత్త సినిమా
ఓ టార్చర్ ప్రేమ మూవీ ఫస్ట్ లుక్ విడుదల
త్వరలోనే విడుదల కానున్న సినిమా
O Torture Prema: మాదాల రవి కుమారుడు సన్నీ మాదాల హీరోగా వస్తున్న మూవీ ‘ఓ టార్చర్ ప్రేమ’. మౌనిక డాకోజు హీరోయిన్ గా పరిచయం అవుతోంది. శ్రీకరం ప్రొడక్షన్స్ పతాకం పై శ్రీకర్ కృష్ణ స్వయదర్శకత్వం లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యూత్ ఫుల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ ను ప్రముఖ రచయిత, దర్శకుడు డాక్టర్ పరచూరి గోపాల కృష్ణ గారు విడుదల చేసారు.
Anil Ravipudi: జానర్ మార్చిన అనిల్ రావిపూడి.. కొత్త మూవీపై క్రేజీ అప్డేట్.. ఇద్దరు హీరోయిన్స్ ఫిక్స్
అనంతరం ఈ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన పరచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ.. ‘మా మాదాల రంగారావు గారి మూడోతరం నుంచి సన్నీ మాదాల హీరో గా పరిచయం అవుతున్నాడు. తన తాత, తండ్రి విప్లవం మార్గంలో సినిమాలు చేస్తే హీరో సన్నీ మాదాల మాత్రం ప్రేమ మార్గాన్ని ఎన్నుకున్నాడు. అదే ‘ఓ టార్చర్ ప్రేమ(O Torture Prema)’. డి ఒక అద్భుతమైన ప్రేమ కథ చిత్రం. దర్శకుడు శ్రీకర్ కృష్ణ దాసరి నారాయణ రావు గారి రీతిలో రచన, దర్శకత్వం తో పాటు నిర్మాణం కూడా ఈ సినిమాకు అందించాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. అని అన్నారు.
ఇక దర్శకుడు శ్రీకర్ కృష్ణ మాట్లాడుతూ.. ఇది ఒక మంచి ప్రేమకథా చిత్రం. ఈ సినిమాకు ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. అలాగే నవ్వులు పూయిస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అని తెలిపారు.
