Roja criticized Pawan
Roja Criticized Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా విమర్శలు చేశారు. పవన్.. ఒక రోజు సీఎం అవుతాను అంటాడు… మరో రోజు ఎమ్మెల్యే కావాలి అంటాడు… ఇప్పుడు గెలవలేను అంటున్నాడు అని సెటైర్లు వేశారు. పార్టీ పెట్టిన వ్యక్తికి ప్రజలకు ఏమి చేస్తారో క్లారిటీ ఉండాలని పవన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజలకు ఏమి చేస్తాడో చెప్పకుండా తమపై చీప్ గా మాట్లాడుతున్నాడని తెలిపారు. ఈ మేరకు రోజా గురువారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు.
తమను కొడతానని చెప్పాడానికే పవన్ పార్టీ పెట్టాడా అని ప్రశ్నించారు. “నాకు ఓట్లు వేసే వారే మీటింగ్ కు రావాలని పవన్ అంటున్నాడు.. అన్నీ చేస్తున్న జగన్ ను కాదని పవన్ కు ఎందుకు ఓట్లు వేయాలి ” అని మంత్రి నిలదీశారు. అమ్మవారి పేరు పెట్టుకొని యాత్ర చేస్తోన్న పవన్.. బూతు పురాణం వల్లిస్తున్నాడని పేర్కొన్నారు.
ప్రజల దృష్టిలో పవన్ విలన్ గా మారుతున్నాడని తెలిపారు. పని అయ్యాక అందరూ వదిలేస్తారని పవన్ గుర్తు పెట్టుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్.. చంద్రబాబు మాట కాకుండా చిరంజీవి మాట వినాలని సూచించారు. ఇకనైనా పవన్ రాజకీయాలు వదిలి, సినిమాలు చేసుకోవడం మేలు… లేకుంటే రెండు చోట్ల పరువు పోగొట్టుకుంటారని తెలిపారు.
“మీరు కలిసి వచ్చినా, విడివిడిగా వచ్చినా నాకు భయం లేదు” అని మంత్రి రోజా అన్నారు. తనకు ఆరోగ్య సమస్య వస్తే జనసేన సైకోలు అనవసరంగా కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. “డెవిల్ ఈజ్ బ్యాక్… మీ అంతు తేలుస్తాను” అని హెచ్చరించారు.