Kotamreddy Sridhar Reddy : నన్ను హౌస్ అరెస్ట్ చేయడం సరికాదు.. సమస్యలపై పోరాడుతూనే ఉంటా : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

తానేమీ విధ్వంసం చేయడం లేదన్నారు. కేవలం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తానని చెప్పానని పేర్కొన్నారు.

Kotamreddy Sridhar Reddy House Arrest : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తనను హౌస్ అరెస్ట్ చేయడం సరికాదని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. పోలీసుల తీరు సరికాదని పేర్కొన్నారు. తనను అరెస్టు చేసినా సమస్యలపై పోరాడుతూనే ఉంటానని చెప్పారు. క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నిధులు ఇవ్వాలని మూడేళ్లుగా కోరుతున్నామని తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.

క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి స్వయంగా మూడుసార్లు సంతకాలు చేశారని గుర్తు చేశారు. తానేమీ విధ్వంసం చేయడం లేదన్నారు. కేవలం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తానని చెప్పానని పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమస్యల కోసం పోరాడుతూనే ఉంటానని పేర్కొన్నారు.

Kotamreddy Sridhar Reddy : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హౌస్ అరెస్ట్.. ఇంటి వద్ద ఉద్రిక్తత

క్రిస్టియన్ కమిటీ హాల్ నిర్మాణం కోసం కేవలం రూ.7 కోట్ల నిధులు అడిగామని తెలిపారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మంగళవారం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఉదయం కోటంరెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఆయనను అడ్డుకున్నారు. దీంతో మాగుంట లేఅవుట్ లోని కోటంరెడ్డి ఇంటి వద్ద ఉద్రికత్త నెలకొంది. అయితే, నెల్లూరులోని గాంధీనగర్ లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణంపై వివాదం నెలకొంది.

క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంగళవారం నిరసన కార్యక్రమం తలపెట్టారు. ఇందులో భాగంగా క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ స్థలంలో నిరసనకు కోటంరెడ్డి ప్లాన్ చేశారు. అందుకోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణ స్థలంలో టెంట్లు వేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.

Nellore Rural Constituency: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇలాఖాలో వైసీపీ తడాఖా చూపుతుందా?

ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని జిల్లా మైనారిటీ అధికారి లేఖ రాసినట్లుగా చెబుతున్నారు. దీంతో పోలీసులు, కోటంరెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం నెలకొంది. అయితే, ఎవరూ అడ్డుకున్నా నిరసన కార్యక్రమం జరిపి తీరుతామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తేల్చి చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు