IT Raids in Big C : బిగ్.సి అధినేత ఏనుగు సాంబశివరావు ఇంట్లో ఐటీ సోదాలు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఐటీ, ఈడీ అధికారుల దాడులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీంట్లో భాగంగా ప్రముఖ మొబైల్స్ షోరూమ్ బిగ్.సి అధినేత ఏనుగు సాంబశివరావు ఇంటిలో తనిఖీలు చేపట్టారు.

IT Raids in Big C : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఐటీ, ఈడీ అధికారుల దాడులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. విజయవాడ నగరంలో ఐటీ అధికారులు సోదాలు రెండోరోజు కూడా కొనసాగుతున్నాయి. దీంట్లో భాగంగా మంగళవారం (అక్టోబర్ 18,2022)ఉదయం ప్రముఖ మొబైల్స్ షోరూమ్ బిగ్.సి (BIG C) అధినేత ఏనుగు సాంబశివరావు (Enugu sambashiva rao) ఇంటిలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు, కీలక పత్రాలను పరిశీలిస్తున్నారు.

బిగ్.సి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సాంబశివరావు కొడుకు స్వప్న కుమార్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్వప్న కుమార్ హోనర్ హోమ్స్‌లో భాగ్యస్వామిగా వ్యహరిస్తున్నారు. గత రెండు రోజులుగా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్న క్రమంలో హోనర్ హోమ్స్‌లో రూ.360 కోట్ల లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్, నెల్లూరులో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు