Pattabhi : మాల్దీవులకి పట్టాభి..!
సీఎం జగన్, డీజీపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత పట్టాభిరామ్.. మాల్దీవులకు వెళ్లినట్లు తెలుస్తోంది. పోలీసులు, అధికార పార్టీ నుంచి ఇబ్బందులు తలెత్తుతాయని వెళ్లారా?
- bheemraj
- Published On : October 26, 2021 / 08:25 AM IST
Pattabhi (1)
Pattabhiram has gone to Maldives : సీఎం జగన్, డీజీపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత పట్టాభిరామ్.. మాల్దీవులకు వెళ్లినట్లు తెలుస్తోంది. పోలీసులు, అధికార పార్టీ నుంచి ఇబ్బందులు తలెత్తుతాయని వెళ్లారా? అనే సందేహాలు కలుగుతున్నాయి.
సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి జైలుకెళ్లిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి బెయిల్ పై విడుదలయ్యారు. రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి విడుదలైన పట్టాభి విజయవాడకు బయలుదేరారు. మీడియాతో మాట్లాడేందుకు పట్టాభి నిరాకరించారు. గురువారం నాడు పట్టాభిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు.
Chandrababu : చంద్రబాబు.. అమిత్‌షాను కలుస్తారా?
అనంతరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో తొలుత మచిలీపట్నం జైలుకు తరలించారు. ఇక అటునుంచి అతడిని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు అధికారులు. ఇక శనివారం పట్టాభికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.
