Chandrababu : చంద్రబాబు.. అమిత్‌షాను కలుస్తారా?

ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నేడు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసే అవకాశం ఉంది. ఏపీలోని తాజా పరిస్థితులను చంద్రబాబు.. కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నారు.

Chandrababu : చంద్రబాబు.. అమిత్‌షాను కలుస్తారా?

Babu

Chandrababu Delhi Tour : ఢిల్లీ పర్యటనలో ఉన్న.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసే అవకాశం ఉంది. ఏపీలోని తాజా పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్న చంద్రబాబు.. పలువురు పెద్దలను కలుస్తున్నారు. అందులో భాగంగానే.. ఇవాళ షాతో బాబు భేటీ అయ్యే అవకాశముంది. అలాగే ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ కోసం కూడా వేచి చూస్తున్నారు బాబు.

చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ నేతల బృందం నిన్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో భేటీ అయింది. ఏపీలో జరిగిన ఘటనలపై రాష్ట్రపతికి నివేదిక అందజేసింది. మాదక ద్రవ్యాలు, ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యలయాలపై దాడులు, తదితర అంశాలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై దాడులు, అక్రమ కేసులు పెట్టి వేధించడాన్ని రాష్ట్రపతికి వివరించారు చంద్రబాబు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కుంటుపడిందని, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే రాష్ట్రపతి పాలన విధించాలని రామ్‌నాథ్‌ కోవింద్‌కు టీడీపీ నేతలు విజ్ఞప్తి చేశారు.

CM JAGAN: ప్రచారానికి రాలేకపోతున్నాను.. ఆమెను గెలిపించండి

తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర ఇలా ఏ రాష్ట్రంలో గంజాయిని పట్టుకున్నా దాని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయన్నారు చంద్రబాబు. ఏపీలో 23 వేల ఎకరాల్లో గంజాయి సాగు పెద్ద ఎత్తున జరుగుతోందని ఆరోపించారు. గుజరాత్ లోని ముంద్రా ఎయిర్ పోర్టులో 21 వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడితే… విజయవాడలోని సత్యనారాయణపురం అడ్రస్ బయటకు వచ్చిందన్నారు. ఏపీ నుంచి ఆస్ట్రేలియాకు డ్రగ్స్ ఎగుమతి అవుతున్నాయనే విషయం బయటపడిందని చంద్రబాబు అన్నారు.