CM JAGAN: ప్రచారానికి రాలేకపోతున్నాను.. ఆమెను గెలిపించండి

బద్వేల్ ఎన్నికల ప్రచారానికి రాలేకపోతున్నాను.. కరోనా పరిస్థితులు, నిబంధనలు కారణంగా నియోజకవర్గంలోని అక్కచెల్లెమ్మలు, అన్మదమ్ములను కలవలేకపోతున్నాను.

CM JAGAN: ప్రచారానికి రాలేకపోతున్నాను.. ఆమెను గెలిపించండి

Jagan

CM JAGAN: బద్వేల్ ఎన్నికల ప్రచారానికి రాలేకపోతున్నాను.. కరోనా పరిస్థితులు, నిబంధనలు కారణంగా నియోజకవర్గంలోని అక్కచెల్లెమ్మలు, అన్మదమ్ములను కలవలేకపోతున్నాను. కానీ, ఉపఎన్నికలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలంటూ ఆ ప్రాంత ప్రజలకు లేఖ రాశారు సీఎం జగన్.

‘బద్వేలు ఉప ఎన్నిక సందర్భంగా నా కుటుంబ సభ్యులైన మీతో బద్వేల్ వచ్చి గడపాలని.. ప్రత్యక్షంగా మిమ్మల్ని బహిరంగ సభ ద్వారా ఓట్లు అడగాలని భావించాను. కానీ కోవిడ్, ఎన్నికల సంఘం నిబంధనలతో బద్వేలు రాలేకపోతున్నాను. మిమ్మల్ని అక్కడికి వచ్చి ఓటు అడగలేకపోతున్నాను. నేను అక్కడికి వస్తే, భారీగా అక్కచెల్లెమ్మలు గుమిగూడితే కొందరికి కోవిడ్‌ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే రాలేకపోతున్నాను’

ఉప ఎన్నికలో ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని దాసరి సుధమ్మను అఖండ మెజారిటీతో గెలిపించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. ఇక బద్వేల్ ఉపఎన్నిక విషయానికి వస్తే, ఎన్నికల ప్రచారానికి 36 గంటల గడువే ఉంది. రేపు(27 అక్టోబర్ 2021) సాయంత్రం ఏడు గంటల తరువాత ప్రచారం బంద్ కానుంది. అక్టోబర్ 30న పోలింగ్ జరగనుంది.