J.P. Nadda: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్.. ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. కేంద్రమంత్రి జేపీ నడ్డా సంచలన ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య రంగ రూపురేఖలను మార్చేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా(J.P. Nadda) రాష్ట్ర వైద్య రంగానికి భారీ నిధుల కేటాయింపులను వెల్లడించారు.
- V Santhosh Kumar
- Published on- September 12, 2026 / 02:50 PM IST
J.P. Nadda announced Rs 64,100 crore for health infrastructure in Andhra Pradesh.
- ఏపీ వైద్యానికి భారీ కేటాయింపులు
- విజయవాడలో కొత్త ల్యాబ్‌ల ప్రారంభం
- ముందస్తు నివారణ వైద్యానికే ప్రాధాన్యం
J.P. Nadda: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య రంగ రూపురేఖలను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్రంలో వైద్య రంగ మౌలిక సదుపాయాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు కేంద్రం పూర్తి మద్దతు ప్రకటించింది. విజయవాడలోని పాత ప్రభుత్వ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్, ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌లతో కలిసి ప్రారంభించిన సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా (J.P. Nadda)రాష్ట్ర వైద్య రంగానికి భారీ నిధుల కేటాయింపులను వెల్లడించారు.
Guntur Murder Case: ప్రియుడి కోసం కన్నతల్లినే.. దారుణంగా హత్య చేసిన కూతురు.. గుంటూరులో ఘోరం!
ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు:
రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్యం నుంచి సూపర్ స్పెషాలిటీ సేవలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏపీకి రూ.64,100 కోట్లు కేటాయించినట్లు జేపీ నడ్డా ప్రకటించారు. రాష్ట్రంలో 24 క్రిటికల్ కేర్ బ్లాక్‌లు, 26 ఇంటిగ్రేటెడ్ ల్యాబొరేటరీలు మంజూరు చేయగా, ఇప్పటికే 500 క్రిటికల్ కేర్ బెడ్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. నివారణ, ముందస్తు వ్యాధి గుర్తింపు, సమగ్ర ఆరోగ్య సేవలందించే దిశగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య వర్ధినీ కేంద్రాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని కొనియాడారు.
ఎయిమ్స్‌తో పాటు మెడికల్ కాలేజీల విస్తరణ:
గత కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా 16 ఎయిమ్స్‌లను ఏర్పాటు చేయగా, 960 పడకల సామర్థ్యంతో మంగళగిరి ఎయిమ్స్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని జేపీ నడ్డా కొనియాడారు. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ అభివృద్ధికి రూ.150 కోట్లు, అనంతపురం మెడికల్ కాలేజీకి రూ.150 కోట్లు వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు. భారతదేశంలో టీబీ కేసులు 21 శాతం మేర తగ్గడం మన వైద్య రంగానికి ఉన్న కట్టుబాటుకు నిదర్శనమని, రాష్ట్రాల్లో ఫార్మా సెక్టార్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
