NTR District: చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే.. జగన్ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు

ఎన్నికల ముందు సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు జిల్లాల పెంపు నిర్ణయం తీసుకున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.

NTR District: ఎన్నికల ముందు సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు జిల్లాల పెంపు నిర్ణయం తీసుకున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం సీఎం జగన్ జిల్లాల పెంచినట్లుగా చెప్పారు. జిల్లాల పెంపుతో ప్రభుత్వ పాలన ప్రజలకు మరింత దగ్గరవుతుందని, అన్నీ ప్రాంతాల అభివృద్ధి సులభం అవుతుందని అన్నారు.

గ్రామ వార్డ్ సచివాలయాల ద్వారా పాలన ప్రజల ఇంటి ముందుకు వెళ్ళిందని, జిల్లాల పెంపు పాలనపరంగా మరింత ఉపయోగకరం అని చెప్పారు. ఈ విషయంలో ఎవరికి అభ్యంతరాలు ఉన్నా ప్రభుత్వానికి చెప్పొచ్చునని, 30రోజుల సమయం ఉందని చెప్పారు. సమస్యలపై ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అన్నారు.

చంద్రబాబు ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కుంటే.. జగన్ ఎన్టీఆర్ పేరు జిల్లాకి పెట్టారని, చంద్రబాబు అధికారంలో ఉండగా ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఎందుకు ఆలోచన చేయలేదని ప్రశ్నించారు.

ఎన్టీఆర్‌ని చంద్రబాబు ఓట్ల కోసమే వాడుకున్నారని, జగన్ ఎన్టీఆర్‌కు మంచి గుర్తింపు ఇచ్చారని అన్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడైనా.. రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్ పేరును జిల్లాకు జగన్ పెట్టారని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు