పార్లమెంట్ లో ఇచ్చిన హామీలను విస్మరించి ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వటంలో కేంద్రం మోసం చేస్తోందని, రాష్ట్రాల హక్కులు కాపాడు కోవాలంటే ఎంపీల సంఖ్యాబలం పెరగాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: పార్లమెంట్ లో ఇచ్చిన హామీలను విస్మరించి ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వటంలో కేంద్రం మోసం చేస్తోందని, రాష్ట్రాల హక్కులు కాపాడుకోవాలంటే ఎంపీల సంఖ్యాబలం పెరగాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం వైసీపీ అధినేత జగన్ ను లోటస్ పాండ్ లో కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు పై చర్చించారు.
తెలంగాణ రాష్ట్ర ఎంపీల సంఖ్య కూడా పెరిగితే బలం పెరుగుతుంది కాబట్టి కేంద్రంపై ఒత్తిడి పెంచి ఏపీకి హోదా సాధిస్తామనే ధీమా జగన్ వ్యక్తం చేశారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం కేసీఆర్ గారు చేస్తున్న కృషిని స్వాగతిస్తున్నాని జగన్ చెప్పారు. కేటీఆర్ చెప్పిన అన్నివిషయాలు పార్టీలో సుదీర్ఘంగా చర్చిస్తామని ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో ఇప్పటికే టీఆర్ఎస్ తన అభిప్రాయాన్ని ప్రకటించామని కేటీఆర్ చెప్పారు.