Pawan Kalyan Election Strategy : ఏపీలో రెండో విడత పురపోరుకు జనసేన రెడీ.. పవన్ కల్యాణ్ టార్గెట్ ఫిక్స్! మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

Pawan Kalyan Election Strategy : ఏపీలో రెండో విడత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయం ఊపందుకుంది. నాలుగు కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది.

Pawan Kalyan Election Strategy

Pawan Kalyan Election Strategy : ఏపీలో రెండో విడత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయం ఊపందుకుంది. నాలుగు కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. ఇప్పటికే పొలిటికల్ పార్టీలు క్యాండిడేట్స్‌ను అనౌన్స్ చేసి క్యాంపెయిన్‌లో జోరు పెంచుతున్నాయి. ఎస్పెషల్‌గా ఫస్ట్ ఫేజ్‌లో పురపోరలో వచ్చిన ఫలితాల్లో కూటమిలో జోరు ఎక్కువగా కనిపిస్తోంది. జనసేన పార్టీ ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుంది.

Also Read : Gannavaram Politics : గన్నవరం టీడీపీలో ఏం జరుగుతోంది? రంగంలోకి లోకేశ్.. వారికి వార్నింగ్

ఇప్పటికే తొలి విడతలో మంచి ఫలితాలు సాధించిన ఆ పార్టీ..రెండో విడతలోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులకు అభ్యర్థులను ఖరారు చేశారు ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ బలాబలాలను పరిగణనలోకి తీసుకొని క్యాండిడేట్స్‌ను సెలెక్ట్ చేసిన పవన్..కూటమిలో టీడీపీ, బీజేపీ కోఆర్డినేషన్‌పై పార్టీ నేతలకు డైరెక్షన్స్ ఇచ్చారట.

ఏపీలో కూటమిలో రెండో బలమైన మిత్రపక్షంగా ఉన్న జనసేనకు పొత్తులో భాగంగా నాలుగు మేయర్ పదవులతో పాటు 21 మున్సిపల్, నగర పంచాయతీ ఛైర్మన్ పదవులు దక్కాయి. అయితే కొన్ని అనివార్య కారణాలు, న్యాయపరమైన ఇబ్బందులతో కొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగలేదు. అందులో జనసేనకు కేటాయించిన నాలిగింటిలో రెండు కార్పొరేషన్లతో 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. శ్రీకాకుళం మేయర్ అభ్యర్థిగా డాక్టర్ దానేటి రాధారాణి, కాకినాడ మేయర్ అభ్యర్థిగా ఆకుల భవాని పేర్లు ఖరారు చేశారు. అలాగే రాజాం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ అభ్యర్థిగా బనిశెట్టి సౌజన్య లత, భీమవరం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ అభ్యర్థిగా డాక్టర్ చుండూరి మల్లేశ్వరి, తాడేపల్లిగూడెం చైర్మన్ అభ్యర్థిగా పాలూరు వెంకటేశ్వరరావు పేర్లను ఎంపిక చేశారు పవన్.

మొదటి దశలో జనసేన పోటీ చేసిన 15 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీల ఛైర్మన్ స్థానాలన్నింటిలో ఘన విజయం సాధించింది. పిఠాపురం, గొల్లప్రోలు, తుని, నిడదవోలు, నరసాపురం, పెడన, తిరువూరు, చిలకలూరిపేట, సాలూరు, అమలాపురం, సామర్లకోట మున్సిపాలిటీల్లో జెండా ఎగరవేసింది ఆ పార్టీ. విజయవాడ, ఏలూరు మేయర్ పీఠాలను కూడా స్వాధీనం చేసుకుంది. దీంతో రెండో విడతలో కూడా సెంట్ పర్సెంట్ విజయాలను దక్కించుకోవాలని జనసేన వ్యూహ రచన చేస్తోంది.

తొలి విడత ఎన్నికల్లో జనసేనకు అనుకూలమైన ఫలితాలు రావడం పార్టీ నాయకత్వంలో ఉత్సాహాన్ని పెంచింది. ఆ దశలో పోటీ చేసిన 15 మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల చైర్మన్ స్థానాలను పార్టీ గెలుచుకుని ఫుల్ జోష్‌లో ఉంది. పట్టణ ప్రాంతాల్లో తమ పార్టీకి ప్రజాదరణ పెరుగుతోందని జనసేన నాయకులు అంచనా వేస్తున్నారట. అయితే రెండో విడతలో పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. స్థానికంగా అభ్యర్థుల ఎంపిక, కూటమి పార్టీల మధ్య సమన్వయం, ఓటర్ల మద్దతు ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి.

కేవలం అభ్యర్థులను ప్రకటించడమే కాకుండా, క్షేత్రస్థాయిలో టీడీపీ, బీజేపీ శ్రేణులను సమన్వయం చేసుకోవడం, ప్రజలు ఆకట్టుకోవడం సవాల్‌గా చెబుతున్నారు. అయితే కాకినాడలో జనసేనకు అనుకూలంగానే ఉన్నా..20ఏళ్ల తర్వాత జరుగుతున్న సిక్కోలు కార్పొరేషన్‌లోనే ఎలాంటి సీన్ ఉండబోతుందనే చర్చ జరుగుతోంది. అక్కడ వైసీపీ టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గుండలక్ష్మీని అభ్యర్థిగా పెడుతుంది. సేమ్‌టైమ్ మాజీమంత్రి ధర్మాన సిక్కోలు మేయర్ ఎన్నికలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తున్నారు. శ్రీకాకుళంలో బలమైన అనుచర వర్గం, ఫాలోయింగ్ ఉన్న గుండలక్ష్మిని పార్టీలోకి చేర్చుకొని కూటమికి సవాల్ విసురుతోంది వైసీపీ.

మరోవైపు మేయర్ పీఠం ఆశించి నిరాశపడ్డ తెలుగు తమ్ముళ్లు జనసేన అభ్యర్థి విజయానికి ఎంతవరకు సహకరిస్తారన్నది కూడా బిగ్ క్వశ్చన్‌గా మారిందట. అయితే జిల్లా మంత్రులు, జనసేన కోఆర్డినేటర్లు..సిక్కోలు కార్పొరేషన్‌పై జెండా ఎగరవేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. ఈ నెల 26న జరగనున్న రెండో దశ పురపోరుకు జనసేన రాజకీయ బలానికి మరో పరీక్షగా నిలవనుందనే చర్చ జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ రిజల్ట్స్‌లాగే అదే స్ట్రైక్ రేటును కొనసాగించి రెండో దశలోనూ మెరుగైన ఫలితాలు సాధిస్తుందా.? లేదా అన్నది.? పొలిటికల్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.