Pawan Kalyan
Pawan Kalyan: ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినూత్నంగా స్పందించారు. మూడు రాజధానుల ప్రతిపాదనను విమర్శిస్తూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. మూడు రాజధానులు కాదు ఏపీని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రాగా ప్రకటించండీ అంటూ ఎద్దేవా చేశారు పవన్. అంతేకాదు ఏపిలోని 25 జిల్లాలను 25 రాష్ట్రాలుగా ప్రకటించి 25 రాజధానులు ఏర్పాటు చేయండీ అంటూ ఎద్దేవా చేశారు. నియంతృత్వ పోకడలు పోతున్న జగన్ ప్రభుత్వం పాలన చేతకాక ప్రజలను ఏమర్చుతోందని..ఏపీని వైసీపీ రాజ్యంగా మార్చుకోండీ అంటూ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
… as well declare AP as
“United States of Andhra” & announce 25 districts as States & go for 25 capitals. ‘Make AP as your YCP Fiefdom’.
And please don’t hesitate, feel free.— Pawan Kalyan (@PawanKalyan) October 11, 2022
సర్వతోముఖాభివృద్ధి వికేంద్రీకరణ మంత్రమని భావిస్తే..ఏపీని మూడు రాజధానులకే ఎందుకు పరిమితం చేయాలి అందుకే 25 రాష్ట్రాలు చేసి 25 రాజధానులు ఏర్పాటుచేయండీ అంటూ మండిపడ్డారు. వైసీపీ నేతలు చట్టం, న్యాయవ్యవస్థ, రాజ్యాంగానికి అతీకంగా వ్యవహరిస్తున్నారని ఎవరన్నా విమర్శిస్తే సమాధానంగా బూతులు మాట్లాడటం తప్ప సిద్ధాంతపరంగా సమాధానం చెప్పటం చేతకాదంటూ విమర్శించారు. ప్రజలు పడే బాధలు వైసీపీ ప్రభుత్వానికి అవసరం లేదు..చేతకాని పాలనతో యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు పవన్ కళ్యాణ్.
ఆంధ్రప్రదేశ్ రాజధాని యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలి అంటూ ఆ ప్రాంత రైతులు మహాపాదయాత్ర కొనసాగుతోంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వారు యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో మూడు రాజధానులపై తగ్గేదే అంటోంది వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే రాజధాని రైతులకు వ్యతిరేకంగా.. నిరసన ర్యాలీలు చేపడుతున్నారు. అక్కడితోనే ఆగకుండా..ఈ నెల 15న గర్జన పేరుతో భారీగా ర్యాలీకి సిద్ధమవుతున్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా ఎందాకైనా వెళ్తామంటున్నారు.. ఇప్పటికే నాన్ పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేసి.. దాని ఆధ్వర్యంలో గర్జన ఏర్పాట్లు చూస్తున్నారు.
తాజా పరిస్థితులు.. వైసీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఏపీని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రాగా మార్చండీ అంటూ సరికొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ఇది వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు పవన్ ఇలా ఎద్దేవా చేస్తు..ఏపీని యునైటెడ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రాగా మార్చి.. 25 జిల్లాలను 25 రాజధానులుగా ప్రకటించండి.. ఏపీని వైసీపీ రాజ్యాంగంగా మార్చుకోండి. ఈ విషయంలో ఎలాంటి సంకోచాలు పెట్టుకోకండి అంటూ సెటైర్లు వేశారు.
అలాగే సోమవారం (అక్టోబర్ 10,2022) కూడా గ్యాప్ లేకుండా ట్వీట్ల వర్షం కురిపంచారు. గర్జన దేనికి అంటూ ప్రభుత్వం తీరును ఎండగట్టారు. అయితే అదే స్థాయిలో వైసీపీ నుంచి కౌంటర్లు వచ్చాయి. మంత్రులంతా క్యూ కట్టి పవన్ పై సోషల్ మీడియాలోనూ.. బయట మాటల దాడి చేశారు. మరి తాజాగా పవన్ ట్వీట్ పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి..