Pawan Kalyan: నేను రాజకీయ పార్టీ నడుపుతున్నా.. సినిమా హాల్ నడపట్లేదు

సరదా కోసం రాజకీయాల్లోకి రాలేదని, సమాజం కోసం వచ్చానని అన్నారు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్.

Pawan Kalyan

Pawan Kalyan: సరదా కోసం రాజకీయాల్లోకి రాలేదని, సమాజం కోసం వచ్చానని అన్నారు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్. తాను మాట్లాడేప్పుడు అరుపులు కేకలు వేస్తున్న అభిమానులకు బాధ్యతగా ఉండాలని హితవు పలికారు పవన్. తాను పార్టీని నడుపుతున్నానని, సినిమా హాల్‌ను నడపట్లేదన్నారు. పార్టీని నడపడం చాలా కష్టసాధ్యమైన విషయమని, ఎత్తై కట్టడం కట్టాలంటే, లోతైన పునాది వేయాలని అన్నారు.

పునాది వేసి ఏడేళ్లవుతుందని, అయితే, బలమైన ప్రభుత్వాన్ని స్థాపించాలంటే జనసైనికులు క్రమశిక్షణతో ఉండాలని సూచించారు పవన్ కళ్యాణ్. వైసీపీ నేతలకు అరవడం తప్ప మాట్లాడడం రాదని అన్నారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడానికా? మిమ్మల్ని ఎన్నుకుంది? అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.

సంక్షేమం, అభివృద్ధి పక్కపక్కనే ఉండాలని, నవరత్నాలు అనే ఉంగరం ఇస్తే, ప్రజల ఆకలి తీరుతుందా? చదువుకోవాల్సిన పదేళ్ల విద్యార్థి పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. సుప్రీం కోర్టు జడ్జిల స్థాయి నుండి 11 ఏళ్ల పిల్లోడు వరకు అందరినీ వైసీపీ వాళ్లు ఇరిటేట్ చేశారు. వైసీపీ నేతలకు జనసైనికులు భయపడాల్సిన అవసరం లేదని, 2024లో వైసీపీని ఓడించాలంటే జనసైనికుల్లో ఐక్యత ముఖ్యమని అన్నారు.