జనసేన టార్గెట్ 9 లక్షలు..! పార్టీ బలోపేతంపై పవన్ కల్యాణ్ ఫోకస్

ఇందుకోసం పార్టీ యంత్రాంగాన్ని మొత్తం కదిలించాలని వ్యూహాలు రచిస్తున్నారు.

Janasena : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నిర్మాణం, బలోపేతంపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీగా సభ్యత్వాన్ని చేర్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. జనసేన రాజకీయ వ్యవహారాల ఇంచార్జి నాదెండ్ల మనోహర్ ముఖ్య నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 50 మందికి లాగిన్ ఐడీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేనలో 6 లక్షల 47వేల మంది సభ్యులుగా ఉన్నారు. అయితే, ఈసారికి సభ్యుల సంఖ్యను 9 లక్షలకు పెంచాలని జనసేన టార్గెట్ గా పెట్టుకుంది. త్వరలోనే ఏపీ, తెలంగాణలో సభ్యత్వ నమోదు చేపట్టాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. 10 రోజుల పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం పార్టీ యంత్రాంగాన్ని మొత్తం కదిలించాలని వ్యూహాలు రచిస్తున్నారు.

Also Read : వ్యూహాత్మకంగా ఒక్క ఖాళీని వదిలేసిన చంద్రబాబు.. మంత్రి పదవిపై జనసేన, బీజేపీ నేతల ఆశలు

ట్రెండింగ్ వార్తలు