NTR Health University row
Pawan Kalyan Key Comments : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపిస్తే తాను రోడ్డెక్కక తప్పదని హెచ్చరించారు. అక్రమ కేసులు ఎదుర్కొంటున్న జనసేన నేతలు పోతిన మహేశ్, బండ్రెడ్డి రామకృష్ణకు అలాగే పార్టీ కార్యకర్తలు, నేతలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Pawan Kalyan Key Comments : ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని అధికారంలోకి రానివ్వం : పవన్ కళ్యాణ్
పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యేలు ఇవాళ ఉంటారు.. రేపు పదవి పోతే ఇంటికి పోతారని పవన్ అన్నారు. అధికారులు మాత్రం సర్వీస్ మొత్తం డ్యూటీలోనే గడుపుతారన్నారు. అధికారులు ధర్మాన్ని పాటించాలని పవన్ కళ్యాణ్ సూచించారు.