Pawan Kalyan sensational comments
Pawan Kalyan sensational comments : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనలోనూ వెన్నుపోటు నేతలు ఉన్నారని పేర్కొన్నారు. తమ పక్కనే కూర్చొని వెన్నుపోటు పొడుస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. బయటి శత్రువు అయితే కనిపెట్టవచ్చని… పక్కనే కూర్చొని వెన్నుపోటు పొడిస్తే పార్టీకి ఇబ్బందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
జనసేన సిద్ధాంతాలు నచ్చితేనే పార్టీలో ఉండాలన్న పవన్..లేదంటే స్వచ్ఛందంగా బయటకు వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. రాష్ట్రాన్ని సరిదిద్దే ముందు పార్టీలో లోపాలు సరిదిద్దుతానని పవర్ కళ్యాణ్ చెప్పారు. వైసీపీ విముక్త ఏపీ తమ లక్ష్యం అన్నారు. తమ ప్లాన్స్ తమకు ఉన్నాయని చెప్పారు.
Janasena Pawan Kalyan : దేశానికి మూడో ప్రత్యామ్నాయం ఉండాలి : పవన్ కళ్యాణ్
సమయాన్ని బట్టి వ్యూహాన్ని మార్చుకుంటామని తెలిపారు. తమ స్ట్రాటజీ తమకు ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని అధికారంలోకి రానివ్వబోమని స్పష్టం చేశారు. రాజధాని ఎక్కడ అంటే.. చెప్పలేని స్థితికి తీసుకొచ్చారని విమర్శించారు.