Pawan Kalyan : విశాఖలో అరెస్ట్ అయిన కార్యకర్తలు, వారి కుటుంబసభ్యులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. వారితో పాటు మంగళగిరి పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న నేతలు, వైజాగ్ కు చెందిన ముఖ్య నాయకులతో పవన్ సమావేశం కానున్నారు.
అలాగే, రేపటి పీఏసీ సమావేశ అజెండాపైనా జనసేన నేతలతో పవన్ చర్చించనున్నారు. రేపు ఉదయం పది గంటలకు జనసేన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో కీలక అంశాలతో పాటు పొత్తుల అంశాలపై నేతలకు క్లారిటీ ఇవ్వనున్నారు పవన్ కల్యాణ్.
ఈ నెల 15న విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రుల కాన్వాయ్ పై దాడి జరిగింది. ఈ ఘటనలో పోలీసులు జనసేన నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారితో పవన్ సమావేశం కాబోతున్నారు. వైజాగ్ లోనే వీరితో పవన్ సమావేశం కావాల్సి ఉంది. అయితే కొంతమంది విడుదల అయ్యారు. కొంతమందికి ఇంకా బెయిల్ రాలేదు. వాళ్లందరికి బెయిల్ వచ్చి విడుదల అయ్యాక అందరితో సమావేశం ఉంటుందని పవన్ ప్రకటించారు. ఇప్పుడు అందరికీ బెయిల్ రావడంతో పవన్ వారితో సమావేశం కానున్నారు. విశాఖ ఘటనలో అరెస్ట్ అయిన వారందరికి న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందనే ఒక భరోసాను పవన్ వారికి ఇవ్వనున్నారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
ఈ మీటింగ్ తర్వాత అందుబాటులో ఉన్న నేతలతో పవన్ సమావేశం కానున్నారు. రేపు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ఉంది. ఈ క్రమంలో దానికి సంబంధించిన అజెండాపై పవన్ కసరత్తు చేయబోతున్నారు. ఇప్పటికే పొలిటికల్ గా పొత్తుల అంశం, వైసీపీని గద్దె దించేందుకు అన్ని పార్టీలతో కలిసి పని చేస్తామంటూ చంద్రబాబు, పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని పార్టీలు ఒకే తాటిపైకి వస్తామని ప్రకటన చేసిన నేపథ్యంలో.. పొత్తుల అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఈ క్రమంలో రేపటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో పొత్తుల అంశంపైనా పవన్ చర్చించనున్నారు. పొత్తులకు సంబంధించి జనసేన నేతల్లో కన్ ఫ్యూజన్ ఉంది. ఒక్కో పార్టీ ఒక్కో విధంగా ప్రకటనలు చేస్తోంది. టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందనే ప్రచారమూ జరుగుతోంది. మరోపక్క బీజేపీకు జనసేన కటీఫ్ చెబుతుందన్న వార్తలూ వస్తున్నాయి. దీంతో జనసేన శ్రేణుల్లో పొత్తులపై కన్ ఫ్యూజన్ నెలకొంది. ఈ అన్ని అంశాలపైనా రేపటి పీఏసీ సమావేశంలో జనసేన నేతలకు పవన్ కల్యాణ్ క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ అంశాలపై కీలక చర్చ జరగనుందని, పార్టీ నేతలకు పవన్ క్లారిటీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.