అక్కడికే వస్తా..తేల్చుకుందాం..ఖాకీలకు పవన్ వార్నింగ్

  • Publish Date - January 13, 2020 / 12:46 AM IST

అక్కడికే వస్తా.. అక్కడే తేల్చుకుందాం… వాళ్లని వదిలేసి మా వాళ్లపై కేసులు పెడతారా.. చూస్తూ ఊరుకునేదే లేదు. ఇదీ కాకినాడ పోలీసులకు జనసేన అధినేత పవన్ ఇచ్చిన వార్నింగ్. అసలు ఢిల్లీ టూర్‌లో ఉన్న జనసేనాని అంతగా రియాక్ట్ ఎందుకయ్యారు. 

* జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ చేసిన కామెంట్స్ నిప్పురాజేసాయి. 
* పవన్ కల్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్ అంటూ చేసిన కామెంట్స్‌పై జనసేన శ్రేణులు భగ్గుమన్నాయి. 
* ద్వారంపూడి వ్యాఖ్యలను నిరసిస్తూ.. జనసేన కార్యకర్తలు 2020, జనవరి 12వ తేదీ ఆదివారం ఆయన ఇంటి  ముట్టడికి యత్నించారు. 
* వైసీపీ కార్యకర్తలు.. వారిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. 

కాకినాడలో ఘర్షణకు కారణమైన వైసీపీ నేతల్ని వదిలేసి జనసేన కార్యకర్తలపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని పవన్ మండిపడ్డారు. జన సైనికులపై అక్రమంగా కేసులు పెడితే ఊరుకునేది లేదని తాను ఢిల్లీ మీటింగ్ ముగించుకొని నేరుగా కాకినాడకే వస్తానన్నారు. అక్కడే తేల్చుకుంటామంటూ ట్విట్టర్ వేదికగా పోలీసుల్ని హెచ్చరించారు. ఇందుకు సంబంధించి జనసేన ప్రెస్ నోట్ విడుదల చేసింది. 

* వైసీపీ, జనసేన కార్యకర్తలు రాళ్లు విసురుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 
* ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. 
* పోలీసులు రంగంలోకి దిగి రెండు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. 
* అయితే ఈ గొడవ సందర్బంగా వైసీపీ నేతలను వదిలేసి జనసేన కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More : రాజధాని రగడ : తేల్చేస్తారా..హై పవర్ కమిటీ భేటీ

అరాచక శక్తులతో దాడులు చేయిస్తే వెనకడుగు వేస్తారనుకోవద్దంటూ హెచ్చరించారు. ప్రజలు ఎన్నుకొన్న ప్రజాప్రతినిధులు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని.. ఇది తప్పు అని చెబుతున్న జనసేన కార్యకర్తలపై దాడికి పాల్పడడం దురదృష్టకరమన్నారు. పక్షపాతం లేకుండా ఇరువర్గాలతో చర్చించి శాంతియుత పరిస్థితులు తీసుకురావాలని కాకినాడ పోలీసులకు విజ్ఞప్తి చేసింది జనసేన.