Balineni Srinivasa Reddy : ఇంతకాలం క్లాస్ చూశారు.. ఇక నా మాస్‌ ఏంటో చూస్తారు.. బాలినేని సంచలన వ్యాఖ్యలు

Balineni Srinivasa Reddy : భూముల వ్యవహారాలపైనా దామచర్లను బాలినేని సూటిగా ప్రశ్నించారు. తనపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపాలన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలకు కూడా ఆధారాలు చూపిస్తానని ఆయన సవాల్ చేశారు.

Balineni Srinivasa Reddy

  • బార్లు, వైన్‌షాపులు, ఇసుకపై మాజీ మంత్రి తీవ్ర ఆరోపణలు
  • నా అనుచరులను కాపోడుకోలేకపోతే నా రాజకీయ జీవితం అనవసరం
  • ఒంగోలుకు 15 బార్లు వస్తే అందులో 13బార్లు వాళ్లకే

Balineni Srinivasa Reddy : ఒంగోలు రాజకీయాల్లో మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి.. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. తన అనుచరులను అక్రమ కేసులతో పోలీసులు వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇకపై తాను వారంలో నాలుగు రోజులు ఒంగోలులోనే ఉంటానని ప్రకటించారు.

నా అనుచరులను కాపాడుకోలేని రాజకీయ జీవితం ఎందుకు? :
తన అనుచరులపై అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాలినేని ఆరోపించారు. వీఆర్‌లో ఉన్న సీఐని తిరిగి అదే స్థానంలో ఎలా నియమిస్తారని ఎస్పీని ప్రశ్నించారు. పోలీస్‌స్టేషన్లలోనే భూముల సెటిల్‌మెంట్లు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోలు తన వద్ద ఉన్నాయన్నారు.

పేదలు, గుడిసెలు వేసుకుని జీవిస్తున్న భూముల నుంచి వారిని అర్ధరాత్రి ఖాళీ చేయించారని ఆరోపించారు. 5 నెలల క్రితం ఎమ్మెల్యే, ఆయన సతీమణిపై వెలిసిన కరపత్రాల వ్యవహారంలో తనపై ఆరోపణలు చేశారన్నారు. అయితే, విచారణలో ఎమ్మెల్యే అనుచరుడైన కిరణ్‌ వాటిని వేసినట్లు తేలిందని బాలినేని పేర్కొన్నారు. అనంతరం అతడితో ఎమ్మెల్యే రాజీ చేసుకున్నారని ఆరోపించారు.

బార్లు, వైన్‌షాపులు, ఇసుకపై తీవ్ర ఆరోపణలు :
ఒంగోలులో 15 బార్లలో 13 బార్లను టీడీపీకి చెందిన చౌదరీలకు కేటాయించారని బాలినేని ఆరోపించారు. అందులో కేవలం రెండింటిలో ఒకటి రెడ్డికి ఇంకోటి కాపులకు కేటాయించారన్నారు. నియోజకవర్గంలోని సగానికి పైగా వైన్‌షాపులు ఎమ్మెల్యేకు చెందినవేనన్నారు.

Read Also : Amazon Great Freedom Sale 2026 : వావ్.. ఏంటి భయ్యా ఈ ఆఫర్! శాంసంగ్ 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. అమెజాన్‌లో ఎంతంటే?

షాపుల నుంచి బెదిరింపులతో మామూళ్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఉచిత ఇసుక కూడా ఎమ్మెల్యే పథకంగా మారిందని విమర్శించారు. ఇసుక ద్వారా నెలకు రూ.50 లక్షలు వసూలు చేస్తున్నారని బాలినేని ఆరోపించారు.

ఆధారాలు చూపిస్తా.. సవాల్ స్వీకరించు :
కొత్తపట్నం, కొప్పోలు, యర్రజర్ల ప్రాంతాల్లో భూముల వ్యవహారాలపైనా దామచర్లను బాలినేని సూటిగా ప్రశ్నించారు. తనపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపాలన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలకు కూడా ఆధారాలు చూపిస్తానని ఆయన సవాల్ చేశారు.

వచ్చే ఎన్నికల్లో తనతో పాటు కుమారుడు ప్రణీత్ రెడ్డి 2 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఇంతకాలం బాలినేనిలో క్లాస్ చూశారు.. ఇక నా మాస్ ఏంటో చూస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన విమర్శలు వ్యక్తిగతమని, జనసేన పార్టీకి సంబంధం లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.