Vidivada RamachandraRao : నాకు టికెట్ ఇవ్వకపోతే ప్రాణం తీసుకుంటా- జనసేన నేత సంచలన హెచ్చరిక

నాదెండ్ల మనోహర్ ను కలవకుండానే తన అనుచరులతో అక్కడి నుండి వెళ్లిపోయారు విడివాడ రామచంద్రరావు.

Vidivada RamachandraRao : జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌కు నిరసన సెగ తాకింది. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన నాదెండ్ల మనోహర్‌ పెంటపాడు మండలం అలంపురంలోని జయా గార్డెన్స్‌లో బస చేశారు. మనోహర్‌ బస చేసిన ప్రాంతానికి తణుకు జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు, పలువురు నేతలు, కార్యకర్తలు వచ్చారు. విడివాడ రామచంద్రరావుకు టికెట్ కేటాయించకపోవడంతో మనోహర్‌ బస చేసిన గెస్ట్‌హౌస్‌ ఎదుట తణుకు జనసైనికులు నిరసన వ్యక్తం చేశారు. విడివాడ రామచంద్రరావు అనుచరులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ క్రమంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. తాడేపల్లిగూడెం డీఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్, కందుల దుర్గేష్‌ జయా గార్డెన్స్‌కు చేరుకున్నారు. విడివాడ రామచంద్రరావును వారు సముదాయించారు. అయినా విడివాడ వినలేదు. నాకు టికెట్ ఇవ్వకపోతే ప్రాణం తీసుకుంటాను అని విడివాడ హెచ్చరించారు. అంతేకాదు.. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానని విడివాడ రామచంద్రరావు తేల్చి చెప్పారు. నాదెండ్ల మనోహర్ ను కలవకుండానే తన అనుచరులతో అక్కడి నుండి వెళ్లిపోయారు విడివాడ రామచంద్రరావు.

Also Read : కొత్త టెన్షన్‌.. కన్ఫ్యూజన్‍లో సేనాని.. పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ

 

ట్రెండింగ్ వార్తలు