Janasena MLA Arava Sridhar, Victim (Image Credit To Original Source)
Arava Sridhar: జనసేన త్రిసభ్య కమిటీ ముందు విచారణకు హాజరయ్యానని రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ఆ పార్టీ నేత అరవ శ్రీధర్ అన్నారు. ఇవాళ కమిటీ ముందు విచారణకు హాజరైన తర్వాత ఆయనను మీడియా మాట్లాడించే ప్రయత్నం చేసింది.
“నా దగ్గర ఉన్న ఆధారాలు అన్నిటినీ కమిటీకి అందించా.. కమిటీ నివేదిక తర్వాత మీడియాతో మాట్లాడతా”నని అరవ శ్రీధర్ హడావుడిగా వెళ్లిపోయారు. వచ్చిన ఆరోపణలపై తర్వాత వివరణ ఇస్తానని అన్నారు.
Also Read: AP Cabinet: ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు.. తిరుమల లడ్డూ వ్యవహారంపై ఇక..
కాగా, అరవ శ్రీధర్ తనపై అత్యాచారం చేశారంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శ్రీధర్ మోసం చేశారని ఆమె చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి.
ఈ నేపథ్యంలోనే ఆ ఆరోపణలపై జనసేన పార్టీ అంతర్గత విచారణ చేస్తోంది. బాధితురాలు రిలీజ్ చేసిన వీడియోలతో పాటు పలు అంశాలకు సంబంధించిన వివరాలను విచారణ కమిటీ సేకరించింది.