AP Cabinet: ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు.. తిరుమల లడ్డూ వ్యవహారంపై ఇక..
లడ్డూ కల్తీ వ్యవహారంపై అసలు సూత్రధాలను గుర్తించేందుకు విచారణ కమిషన్ను ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.
- తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంపై ప్రధానంగా చర్చ
- విచారణ కమిషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయం
- గత వైసీపీ సర్కారు తీరుపై అసహనం
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయోధ్య రామమందిరానికి కూడా అవే కల్తీ లడ్డూలు సరఫరా చేయటాన్ని మహాపాపంగా అభిప్రాయపడింది మంత్రివర్గం. కల్తీ రసాయనాలతో 20 కోట్ల లడ్డూలు తయారు చేసి పంపిణీ చేయటాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. లడ్డూ కల్తీ వ్యవహారంపై అసలు సూత్రధాలను గుర్తించేందుకు విచారణ కమిషన్ను ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.
Also Read: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి షాక్.. మరో రెండు కేసులు
మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాకు వివరాలు తెలిపారు. పాల సేకరణలో మూడు నిబంధనలు పెట్టారని వివరించారు. 4 లక్షల లీటర్ల పాలను సేకరించే సంస్థగా ఉండాలని నిబంధన ఉందని చెప్పారు. రూ.250 కోట్ల నుంచి రూ.150 కోట్లకు తగ్గించారని తెలిపారు. పాలు సేకరించాలనే నిబంధన తీసేశారని అన్నారు. సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న భోలే బాబా డెయిరీకి వెళ్లారని చెప్పారు. తప్పులు జరుగుతున్నప్పటికీ గత వైసీపీ సర్కారులోని పెద్దలు మౌనంగా ఉండడం ఏంటని ఆయన నిలదీశారు.
మరోవైపు, వైసీపీ హయాంలో 2022లో చేయించిన సీఆర్టీఐ నివేదికలోనే కల్తీ నిర్ధారణ అయినా చర్యలు తీసుకోకపోవటాన్ని మంత్రివర్గం తప్పుబట్టింది. పర్చేస్ కమిటీలో నాడు తాను, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సభ్యులుగా ఉన్నా తమని సమావేశానికి కనీసం ఆహ్వానించలేదని క్యాబినెట్ దృష్టికి తీసుకొచ్చారు మంత్రి పార్థసారథి.
తమను పిలవకు పోగా పర్చేస్ కమిటీలో సభ్యులు కానీ కరుణాకర్ రెడ్డి పాల్గొన్న విషయాన్ని మంత్రివర్గానికి పార్థసారథి వివరించారు. పర్చేస్ కమిటీలో సభ్యులుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కమిటీలోలేని కరుణాకర్ రెడ్డి నిబంధనలు సడలించి కల్తీకి తెరలేపారని మంత్రివర్గం అభిప్రాయపడింది.
