Janasena Party: జంపింగ్‌లకు ప్రత్యామ్నాయంగా జనసేన.. వారాహి యాత్రతో పవన్ పార్టీలో జోష్!

జనంలో పవన్‌కి ఆదరణ ఉన్నా.. వాటిని ఓట్ల రూపంలో మలిచే నాయకత్వం జనసేనకు లోటుగా ఉండేది. ఇప్పుడు చేరికల కాలం మొదలు కావడంతో త్వరలో ఆ లోటూ భర్తీ అవుతోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు జనసేన నేతలు.

Pawan Kalyan, Janasena

Janasena Party Joinings: ఏపీ రాజకీయాల్లో జనసేన గ్రాఫ్ పెరుగుతోందా? వారాహి యాత్ర (varahi vijaya yatra) తర్వాత పవన్ పార్టీ ఫేట్ మారుతోందా? అధికార వైసీపీ నుంచి జనసేనలోకి జంప్ చేస్తున్న నేతలు ఎందరు? ఇప్పటికే బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్న నేతలు ఎవరెవరు? జనసేనలో జోష్ తెచ్చిన పవన్ స్ట్రాటజీ ఏంటి? తెరవెనుక (Tera Venuka) రాజకీయం ఎలా ఉంది?

జనసేనాని పవర్ వారాహి యాత్రతో ఆ పార్టీలో ఊపు కనిపిస్తోంది. లీడర్ల కొరతను ఎదుర్కొంటున్న జనసేనలో ఇప్పుడు చేరికలు మొదలయ్యాయి. ఇన్నాళ్లు జనసేన అంటే పవన్, నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) మాత్రమే కనిపించేవారు.. ఈ ఇద్దరు తప్ప ముఖ్యనాయకులు ఇంకా ఎవరైనా ఉన్నారా? అంటే టక్కున జవాబు చెప్పడం కష్టమే అయ్యేది.. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారు.. ఓటమి తర్వాత నియోజకవర్గాలను వదిలేశారు. గోదావరి జిల్లాల్లో ఒకరిద్దరు నాయకులు తప్ప.. ఏ ఒక్కరూ నియోజకవర్గ రాజకీయాలను ప్రభావితం చేయలేకపోతున్నారు. జనంలో ఊపు ఉన్నా.. ఎన్నికల్లో ఓట్లుగా మలుచుకోవడం జనసేనకు పెద్ద సవాల్‌గామారింది. పవన్ వారాహి యాత్రతో ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందని అంటున్నారు పరిశీలకులు.

గత నెలలో అన్నవరం నుంచి భీమవరం (Bhimavaram) వరకు తొలివిడత వారాహి యాత్ర చేసిన పవన్ గోదావరి జిల్లాల్లో తన జనబలం ఏంటో చూపించారు. రెండో విడత కూడా సూపర్‌గా పవన్ సభలు సక్సెస్ అయ్యాయని జనసైనికులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇందుకు తగ్గట్టుగానే పవన్ చేసిన మలివిడత వారాహియాత్ర పూర్తయిన వెంటనే ఇద్దరు ముఖ్యనేతలు జనసేనకు టచ్‌లో వెళ్లారు. విశాఖ జిల్లా వైసీపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు (Panchakarla Ramesh Babu) తో పాటు.. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ (Amanchi Krishna Mohan) సోదరుడు ఆమంచి స్వాములు (Amanchi  Swamulu) జనసేనానితో భేటీ అయ్యారు. ఈ ఇద్దరి చేరికకు ముహూర్తం ఫిక్స్ అయింది. వీరి బాటలోనే మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. విశాఖ మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్, మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే కొనకల్ల నారాయణ (Konakalla Narayana Rao), మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ (Konatala Ramakrishna) వంటివారు జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వీరిలో మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్ విశాఖ వైసీపీ అధ్యక్ష పదవిని కూడా వద్దంటూ పక్కచూపులు చూస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

Also Read: వైసీపీలో వారసుల సందడి.. తలలు పట్టుకుంటున్న వైసీపీ పెద్దలు..!

జనంలో పవన్‌కి ఆదరణ ఉన్నా.. వాటిని ఓట్ల రూపంలో మలిచే నాయకత్వం జనసేనకు లోటుగా ఉండేది. ఇప్పుడు చేరికల కాలం మొదలు కావడంతో త్వరలో ఆ లోటూ భర్తీ అవుతోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు జనసేన నేతలు. ఇప్పటికే గోదావరి జిల్లాలో ఓ స్థాయి నేతలు చేరారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు వంటి వారు వచ్చే ఎన్నికల్లో జనసేన నుంచి పోటీకి సై అంటున్నారు. ముఖ్యంగా వారాహి యాత్ర పూర్తయిన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనలో చేరికలకు పెద్ద ఎత్తున ఉత్సాహం చూపిస్తున్నారు. అధికార వైసీపీ, టీడీపీలో అసంతృప్తులు.. టిక్కెట్లు దక్కవని బెంగతో ఉన్న నేతలు ఇప్పుడు జనసేనను ఎంచుకుంటున్నారు. ఇన్నాళ్లు వైసీపీ, టీడీపీ మధ్యే జంపింగ్‌లు ఉండేవి. ఇప్పుడు ఆ రెండు పార్టీల నేతలకు ప్రత్యామ్నాయంగా జనసేన కనిపిస్తోంది.

Also Read: ఆంధ్రప్రదేశ్ సభా హక్కుల కమిటీ.. అసెంబ్లీ జాయింట్ కమిటీల నియామకం.. ఎవరెవరికి ఏయే పదవులంటే?

ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఈ చేరికలు ఎక్కువయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు జనసేన కార్యకర్తలు. విశాఖలో పంచకర్ల రమేశ్‌బాబు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆమంచి కాస్త పట్టున్న నేతలే.. పైగా ఈ ఇద్దరు కాపు సామాజిక వర్గ నేతలు. వీరి చేరిక తర్వాత ఆ వర్గం నుంచి మరికొందరు నేతలు జనసేనలో చేరడం ఖాయమనే టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా పవన్ వారాహి యాత్ర జనసేనకు ఊపు తెచ్చి.. పార్టీలో చేరికలు పెరిగేలా చేసిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు జనసైనికులు.

ట్రెండింగ్ వార్తలు