Janasena Party : సనాతన ధర్మ పరిరక్షణకు ఐక్యంగా కదులుదాం.. 4 రోజుల పాటు ధార్మిక కార్యక్రమాలు!

Janasena Party : పవన్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా జనసేన పార్టీ సైతం 4 రోజుల పాటు ధార్మిక కార్యక్రమాలను చేపట్టాలని ప్రకటించింది. సనాతన ధర్మ పరిరక్షణకు ఐక్యంగా కదులుదామని పిలుపునిచ్చింది.

pawan kalyan prayaschitta deeksha

Janasena Party : తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. మొత్తం 11 రోజుల పాటు ఈ ప్రాయశ్చిత్త దీక్షను కొనసాగించనున్నారు. అయితే, దీక్షలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం మెట్లును పవన్ కడిగి శుద్ధి చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సనాతన ధర్మ పరిరక్షణ కోసం పోరాడతానని పవన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పవన్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా జనసేన పార్టీ సైతం 4 రోజుల పాటు ధార్మిక కార్యక్రమాలను చేపట్టాలని ప్రకటించింది. సనాతన ధర్మ పరిరక్షణకు ఐక్యంగా కదులుదామని పిలుపునిచ్చింది.

ఇందులో భాగంగానే ఈ నెల 30న దీపారాధన, అక్టోబర్ ఒకటో తేదీన ‘ఓం నమో నారాయణాయ’ మంత్ర పఠనం, 2వ తేదీన నగర సంకీర్తన, 3వ తేదీన ఆలయాల్లో భజన కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.

అంతేకాదు.. పార్టీ నాయకులు, వీర మహిళలు, శ్రేణుల ఆధ్వర్యంలో అనేక ధార్మిక కార్యక్రమాలను నిర్వహించాలని సూచించింది. ఈ ధార్మిక కార్యక్రమాల్లో సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ భాగస్వాముల్ని చేయాలని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. 11 రోజుల సంఘీభావ దీక్షను పవన్ తిరుమలలో విరమించనున్నారు.

Read Also : AP Universities : ఒకే చట్ట పరిధిలోకి అన్ని యూనివర్శిటీలు : సీఎం చంద్రబాబు