AP Universities : ఒకే చట్ట పరిధిలోకి అన్ని యూనివర్శిటీలు : సీఎం చంద్రబాబు
AP Universities : ఏపీ ఉన్నతవిద్యాశాఖపై అధికారులతో సచివాలయంలో రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. అన్ని యూనివర్శిటీలను ఒకే చట్ట పరిధిలోకి తీసుకురానున్నట్టు తెలిపారు.

AP CM Chandrababu
AP Universities : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని యూనివర్శిటీలను ఒకే చట్ట పరిధిలోకి తీసుకురానున్నట్టు రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం (సెప్టెంబర్ 24)న ఏపీ ఉన్నతవిద్యాశాఖపై అధికారులతో సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ వర్సిటీల బలోపేతం, పోస్టుల భర్తీ, ప్రమాణాల పెంపు వంటి పలు అంశాలపై అధికారులతో చర్చించారు.
గత ప్రభుత్వంలోని అసమర్థ విధానాలు, ఉన్నత విద్యా రంగంపై చిన్న చూపుతో ఉన్నవిద్య రంగం గాడితప్పిందని చంద్రబాబు అన్నారు. బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఛైర్‌పర్సన్స్‌గా పారిశ్రామికవేత్తలను నియమించే ప్రతిపాదనలు చేస్తున్నామని చెప్పారు. ఉన్నత విద్యారంగాన్ని తిరిగి పట్టాలెక్కించి మంచి ఫలితాలను సాధించే దిశగా అనేక కార్యక్రమాలను చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
పీపీపీ విధానంలో ఏఐ వర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్‌కు ఐదేళ్ల యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించనున్నట్టు తెలిపారు. రాజధాని నవనగరాల్లో భాగంగా అమరావతిలో స్పోర్ట్స్ విలేజ్ కూడా నిర్మించనున్నట్టు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి కరికులం మార్పునకు నిపుణులతో కమిటీ వేయనున్నట్టు తెలిపారు.
రాజకీయ జోక్యం లేని విధంగా పారదర్శకంగా వీసీలను నియమిస్తామని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీల బలోపేతంపై వెంటనే దృష్టిసారించాలని విద్యాశాఖ అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.
Read Also : హైడ్రాపై పోరాటానికి బీజేపీ రెడీ.. హైడ్రా దూకుడును అడ్డుకునేలా వ్యూహం?