Pothina Venkata Mahesh
Andhra Pradesh: తెలంగాణ మంత్రి హరీష్‌రావు (Telangana Minister Harish Rao) మాట్లాడిన మాటలకు జగన్ (Jagan) కు, మంత్రులకు పౌరుషం రావడంలేదా? ఏపీలో అవకాశాలు లేవని చెబితే సిగ్గు అనిపించడం లేదా అంటూ జనసేన ఏపీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ (Pothina Venkata Mahesh) ప్రశ్నించారు. విజయవాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలను కించపర్చవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena chief Pawan Kalyan) చాలా సందర్భాల్లో చెప్పారని, అన్నారు. పేర్ని నాని (perni nani) పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదన్నారు. పేర్ని నానికి పిచ్చి బాగా ముదిరిందని, అజ్ఞానం ఎక్కువైందని, కేవలం తాడేపల్లి ప్యాలెస్ (Tadepalli Palace) స్క్రిప్ట్ గుడ్డిగా చదవుడే ఆయన పనిగా మారిందని విమర్శించారు. కనీసం సిదిరి అప్పలరాజు (Sidiri Appalaraju) మాట్లాడిన మాటలు పాలేరు పేర్ని నానికి వినపడలేదా అని ప్రశ్నించారు.
Perni Nani : ఏపీని తిట్టిన మంత్రి తరపున కిరాయి మాటలు మాట్లాడుతావా? పవన్‌పై పేర్ని నాని ఫైర్
తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలపై పేర్ని నాని, అప్పలరాజు, బొత్స, కారుమూరు వంటివారు గట్టిగా మాట్లాడేందుకు వణికిపోతున్నారని, బీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తే లోటస్ పాండ్ కూలిపోతుందనే భయమా? లేక మీ వ్యాపారాలు హైదరాబాద్‌లో ఉండవనా? అంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరించడం కాదని, మీకు దమ్ముంటే హరీష్ రావు వ్యాఖ్యలుకు గట్టిగా కౌంటర్ ఇవ్వండన్నారు.
తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్ర చేస్తున్న షర్మిల అప్పలరాజు వ్యాఖ్యలను ఎందుకు ఖండించ లేదని ప్రశ్నించిన మహేష్.. మీరు మాట్లాడకపోతే అన్నా చెల్లెల్లు డ్రామా అనుకోవాల్సి వస్తుందని అన్నారు. పెద్దిరెడ్డి, బుగ్గన, మిథున్ రెడ్డికి ధైర్యం ఉంటే తెలంగాణ ప్రెస్‌క్లబ్‌కి వెళ్లి మాట్లాడాలని, మీరు ఆ ప్రెస్‌క్లబ్ నుండి బయటకి రాగలరా. సీఎం సామాజిక వర్గం మంత్రులు సేఫ్ చూసుకుని, ఇతర వర్గాలను ఉసి గొల్పుతున్నారన్నారు. కాపు, బీసీ, దళిత మంత్రులే ఎదుటి వారిని తిట్టాలా.. జగన్, అతని సామాజిక వర్గం మంత్రులుకు నోళ్లు లేవా అని విమర్శించారు. మీరెన్ని కుట్రలుచేసినా వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓటమి ఖాయమని అన్నారు.
పవన్ కళ్యాణ్ తాను కష్టపడి సంపాదించుకున్న సొమ్మును సేవా కార్యక్రమాలు ఇస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి దోచుకో, దాచుకో అనే విధానంతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాడంటూ వెంకట మహేష్ విమర్శించారు. ఇస్లాం విద్య, ధార్మిక సంస్థలకు రూ. 25 లక్షల విరాళంను పవన్ ప్రకటించారని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మదరాసీలకు ఐదు లక్షలు విరాళంగా ఇచ్చారని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రెండువేల మంది ముస్లీం పేద కుటుంబాలకు రంజాన్ తోఫా అంద చేస్తామని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు.