Perni Nani : ఏపీని తిట్టిన మంత్రి తరపున కిరాయి మాటలు మాట్లాడుతావా? పవన్‌పై పేర్ని నాని ఫైర్

కన్న తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోవాలా పవన్ అంటూ వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ప్రశ్నించారు. అంటే, పవన్ కళ్యాణ్‌కు ఏపీ కేవలం రాజకీయ అవసరాల కోసమేనా? సొంత రాష్ట్రంపై ప్రేమ లేదా అంటూ ప్రశ్నించారు.

Perni Nani : ఏపీని తిట్టిన మంత్రి తరపున కిరాయి మాటలు మాట్లాడుతావా? పవన్‌పై పేర్ని నాని ఫైర్

Perni Nani: తెలంగాణ ప్రాంతాన్ని, ప్రజలను వైసీపీ మంత్రులు, నాయుకులు ఎవరూ ఏమనలేదని, కేవలం హరీష్ రావు వ్యాఖ్యలకు స్పందనగానే ఏపీ మంత్రులు మాట్లాడారని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణ ప్రజలను అన్నట్లు ఏపీ మంత్రులపై బురద జల్లుతున్నాడంటూ నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడితే సహించేది లేదంటూ ఏపీ మంత్రులను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలకు సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు కౌంటర్ ఇస్తే.. పవన్ కళ్యాణ్ మాత్రం అసత్యాలను మాపై రుద్ది రాజకీయ లబ్ధిపొందాలనుకుంటున్నాడంటూ నాని అన్నారు.

Pawan Kalyan : వైసీపీ నేతలూ.. తెలంగాణ ప్రజల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోండి : పవన్ కల్యాణ్

బీఆర్ఎస్ కోసం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వకీల్ కొత్త పాత్ర ఏమిటని నాని ప్రశ్నించారు?  టీఆర్ఎస్‌తో పవన్‌కు కొత్త బంధం ఏర్పడిందా? తల్లివంటి ఏపీని అవమానిస్తే పవన్‌కు బాధ లేదా? ఈ రాష్ట్రం తన సొంత గడ్డ అన్న భావన పవన్‌కు లేదా? అంటూ నాని ప్రశ్నించారు. యాత్ర చేస్తాను అంటే.. ఎవరో అమాయకుడు వ్యాన్ కొనిస్తే తిరక్కుండానే పవన్ పక్కన పడేశాడని, లోకేష్ పాదయాత్ర కోసం చంద్రబాబు ఆర్డర్ మేరకు యాత్ర మానేశాడంటూ నాని విమర్శించారు. ఏపీలో ప్రజలు తనని మర్చిపోతారని ఈరోజు ఏదో మాట్లాడాడని, హరీష్ రావు ఏమీ మాట్లాడాడు.. అనేది చెప్పడం లేదుకాని, హరీష్ రావు(Harish Rao) కామెంట్స్ పై మా మంత్రులు బదులిస్తే వాటిని ఖండిస్తూ వ్యాఖ్యలు చేయటం సిగ్గుమాలిన రాజకీయాలకు నిదర్శనం అన్నారు. తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ ప్రాంతాన్ని మా మంత్రులు ఏమీ అనలేదని నాని స్పష్టం చేశారు.

Adapa Seshu: పవన్ కల్యాణ్ ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పి రావాలి : వైసీపీ నేత

కన్న తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోవాలా పవన్ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. అంటే, పవన్ కళ్యాణ్‌కు ఏపీ కేవలం రాజకీయ అవసరాల కోసమేనా? సొంత రాష్ట్రంపై ప్రేమ లేదా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం, అక్కడి మంత్రులను విమర్శలు చేస్తే పవన్‌కి కొత్త బాధ ఎందుకో అర్థం కావటం లేదని అన్నారు. తెలంగాణ (Telangana) పై ఇంత ప్రేమ ఇప్పుడు యెందుకు..? పవన్ ఆస్తులు అక్కడే.. వ్యవహారాలు అక్కడే.. అక్కడి నేతలంటే భయమా అని ప్రశ్నించారు. పవన్ కు తెలంగాణ ప్రభుత్వం తో కొత్త బంధం ఎప్పుడు ఏర్పడిందని, ఏపీని తిట్టిన మంత్రి తరపున కిరాయి మాటలు మాట్లాడుతున్నాడంటూ నాని పవన్ పై ఘాటు విమర్శలు చేశాడు.

బీఆర్ఎస్ కోసం పవన్ కొత్త వకీల్ పాత్ర.. 
నిన్నటి వరకూ చంద్రబాబు, లోకేష్ లని ఏమైనా అంటే వచ్చేవాడిని ఇప్పుడు బీఆర్ఎస్ గురించి కూడా వచ్చేస్తున్నావా పవన్ అంటూ నాని అన్నారు. పవన్ కళ్యాణ్ బీఆర్ఎస్ ( BRS Party)కోసం కొత్త వకీల్ పాత్ర పోషిస్తున్నాడంటూ విమర్శించారు. ఆనాడు రాష్ట్రం విడిపోతే 11 రోజులు అన్నం మనేశానని చెప్పిన పవన్, ఇప్పుడు ఏపీపై అసత్య ప్రచారం చేస్తున్న తెలంగాణ మంత్రులను వెనుకేసుకొస్తున్నాడని నాని అన్నారు. గతంలో కేసీఆర్‌ను తాట తీస్తాను అన్నప్పుడు ఈ బాధ ఏమైంది పవన్ అంటూ ప్రశ్నించారు. పవన్ డమ్మీ వార్నింగ్‌లు సినిమాలకు మాత్రమే పనికొస్తాయంటూ ఎద్దేవా చేశారు.

వివేకా హత్యకేసు విచారణ చంద్రబాబు డైరెక్షన్‌లో ..
వివేకా హత్య కేసు అసహజ రీతిలో తప్పుడు మార్గంలో వెళ్తుందని గుర్తించిన సుప్రీంకోర్టు,  రామ్ సింగ్‌ను పక్కన పెట్టాలని చెప్పిందని,  అయితే, ప్రస్తుతం ఉన్న అధికారికూడా అదే బాటలో నడుస్తున్నాడంటూ పేర్ని నాని అన్నారు. వాస్తవ కోణంలో కాకుండా రాజకీయ కోణంలో విచారణ జరుగుతోందని ఆరోపించారు. వాస్తవ కోణంలో విచారణ జరగాలని మేము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. చంద్రబాబు వ్యవస్థను ఏమార్చే విషయంలో సిద్ధహస్తుడని, ఈ కేసు వక్ర మార్గంలో నడవడం వెనుక చంద్రబాబు ఉన్నాడని, వివేకా కుమార్తె సునీత, రామ్ సింగ్ అంతా చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఉన్నారంటూ పేర్ని నాని ఆరోపించారు.