ఇంట్లోనే తెలుగు రాష్ట్రాల నేతలు..ఒకరు మనవళ్లతో ఆటలు..మరొకరు కుటుంబసభ్యులతో సరదాగా

  • Publish Date - March 22, 2020 / 09:34 AM IST

కరోనా వైరస్ కట్టడి చేసేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. దేశ వ్యాప్తంగా ప్రజలు ఇళ్లలో నుండి బయటకు రాలేదు. వ్యాపార, వాణిజ్య సముదాయాలను స్వచ్చందంగా మూసేశారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఏమైనా కర్ఫ్యూ విధించారా అనే పరిస్థితి కనిపించింది.

కానీ ..మోడీ ఇచ్చిన పిలుపును భారతదేశ ప్రజలు స్వాగతించారు. తమ తమ పనులను మానుకొని ఇళ్లలోనే ఉండిపోయారు. 2020, మార్చి 22వ తేదీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కర్ఫూలో పాల్గొంటున్నారు. అయితే..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

14 గంటలు..కాదు..24 గంటల పాటు పాటిద్దామని, దేశానికి ఆదర్శంగా నిలుద్దామని పిలుపునిచ్చారు. దీనికి బాగానే రెస్పాండ్ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు. ఇతరులకు మార్గదర్శకంగా ఉండే నేతలు ఈ నిబంధనను ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు. జనతా కర్ఫ్యూలో భాగంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు ఇంట్లోనే గడిపారు. వారి వారి కుటుంబసభ్యులతో సరదాగా గడిపారు. పలువురు నేతలు ప్రజలు సోషల్ మీడియా ద్వారా మెసేజ్ పంపించారు. ఈ కరోనా మహమ్మారిని పారదోలుదామని, ప్రజలు స్వచ్చందంగా కర్ఫ్యూలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

* హరీష్ రావు కుటుంబసభ్యులతో సరదాగా గడిపారు.
* మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తన మనవరాళ్లు, మనవళ్లతో కాలక్షేపం చేశారు. 
 

* సినీ నటుడు నాగశౌర్య ఇంట్లోనే ఉంటూ…అమ్మతో కలిసి ఆవకాయ పెట్టడం విశేషం.
* కమ్యూనిస్టు నేత (సీపీఐ) నారాయణ మాత్రం యోగసానాలు చేశారు.

* తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో బిజీగా గడిపారు. 
* బీజేపీ ఎంపీ సుజనా చౌదరి…మనవడితో ఆటలాడారు. 

* ఇక ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికే పరిమితం అయ్యారు.
* తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటల మాత్రం అధికారులతో బిజీ బిజీగా గడిపారు. కరోనా వైరస్ వ్యాపించకుండా..తీసుకుంటున్న చర్యలు..జనతా కర్ఫ్యూ ఎలా కొనసాగుతుంది ? తదితర వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.  

ట్రెండింగ్ వార్తలు