Jawan Sai Teja : ఆదివారం సాయితేజ అంత్యక్రియలు
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన పారా కమాండో సాయితేజ భౌతికకాయం కోయంబత్తూరు చేరుకుంది. అక్కడి నుంచి బెంగళూరు ఎయిర్ బేస్‌కు తరలించారు.
- madhu
- Published On : December 11, 2021 / 01:37 PM IST
Saiteja
Jawan Sai Teja Funerals : ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన పారా కమాండో సాయితేజ భౌతికకాయం కోయంబత్తూరు చేరుకుంది. అక్కడి నుంచి బెంగళూరు ఎయిర్ బేస్‌కు తరలించారు. 2021, డిసెంబర్ 11వ తేదీ శనివారం రాత్రికి ఆర్మీ బేస్ ఆసుపత్రిలోనే సాయితేజ భౌతికకాయం ఉంచుతారు. ఆదివారం ఉదయం 9 గంటలకు సాయి స్వగ్రామం ఎగువరేగడికి చేరుకుటుంది.
Read More : Attica Gold Company : అట్టికా గోల్డ్ కంపెనీలో చోరీ-దొంగలెవరు ?
అంత్యక్రియలపై కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.. ఆదివారం సాయితేజ అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి సాయితేజ మృతదేహాన్ని కోయంబత్తూరు ఎయిర్ బేస్‌కు తరలించారు. కోయంబత్తూరు నుంచి బెంగళూరుకు ఎయిర్ లిఫ్ట్ చేసి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో స్వగ్రామానికి తీసుకురానున్నారు ఆర్మీ అధికారులు..
Read More : Pumpkin Seeds : గుమ్మడి గింజలు తింటే కలిగే ప్రయోజనాలు.. సమస్యలు
అయితే భౌతికకాయం సాయంత్రానికి చేరుకుంటే అంత్యక్రియలు నిర్వహించలేమని సాయితేజ సోదరుడు మహేశ్ తెలిపారు.. ఆదివారం ఉదయం భౌతికకాయం అప్పగించాలని ఆర్మీ అధికారులను విజ్ఞప్తి చేశామని.. మా విజ్ఞప్తిని అధికారులు అంగీకరించారన్నారు. ఉదయం సాయితేజ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు.
మరోవైపు సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.. 50 లక్షల రూపాయలను ఆ కుటుంబానికి అందించాలని నిర్ణయించింది.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సాయితేజ కుటుంబాన్ని పరామర్శించి.. 50 లక్షల రూపాయల చెక్కును అందించనున్నారు.
