నిత్యం కాంట్రవర్సీ కామెంట్స్ తో వార్తల్లో ఎక్కే నేత జేసీ దివాకర్ రెడ్డి. ఆయన ఎప్పుడు ఎవరి మీద ఎలా నోరు పారేసుకుంటారో ఆయనకే తెలీదు. నోటికి ఎంతొస్తే అంతా అనేస్తారు.
నిత్యం కాంట్రవర్సీ కామెంట్స్ తో వార్తల్లో ఎక్కే నేత జేసీ దివాకర్ రెడ్డి. ఆయన ఎప్పుడు ఎవరి మీద ఎలా నోరు పారేసుకుంటారో ఆయనకే తెలీదు. నోటికి ఎంతొస్తే అంతా అనేస్తారు. మనసులో ఏదీ ఉంచుకోరు. ఓసారి చంద్రబాబుని తిడతారు, మరోసారి జగన్ ను ప్రశంసిస్తారు. జేసీ దివాకర్ రెడ్డి రూటే సెపరేటు. తాజాగా రాజధాని రగడపై జేసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. సీఎం జగన్ కు..మూర్ఖత్వం, అహంకారం ఎక్కువ అని మండిపడ్డారు. ఆ కారణంగానే రాష్ట్రాన్ని విభజిస్తున్నారని చెప్పారు. జగన్.. ఒక వర్గం మీద, కులం మీద కోపంతోనే రాజధాని మారుస్తున్నారని జేసీ ఆరోపించారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్న వ్యక్తి జగన్ అన్నారు. జగన్ మూర్ఖత్వమే ఆయనను మోసం చేస్తుందన్నారు.
మెదడు లేని తల ఎందుకు..?
ఎన్టీఆర్ కు పూర్తిగా వ్యతిరేకంగా పని చేస్తున్న వ్యక్తి జగన్ అని జేపీ అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కంటే ముందు జగన్ సీఎం కావాల్సిన వ్యక్తి అని.. అయితే మూర్ఖత్వం కారణంగా ముఖ్యమంత్రి అవకాశాన్ని జగన్ పోగొట్టుకున్నారని జేసీ చెప్పారు. అసెంబ్లీ, సచివాలయం ఒక చోట ఉంటేనే రాజధాని అవుతుందన్నారు జేసీ. సచివాలయం మెదడు లాంటిది అన్న జేసీ.. మెదడు లేని తల ఎందుకు అని ప్రశ్నించారు. జగన్ తన మూర్ఖత్వం వదులుకోవాలని జేసీ సూచించారు.
కృష్ణా, గుంటూరు జిల్లాల వారికి డబ్బు మీదే ఆశ ఎక్కువ:
కృష్ణా, గుంటూరు జిల్లాల వారికి డబ్బు మీదే ఆశ ఎక్కువ అని జేసీ విమర్శించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల మగవాళ్ల కంటే మా ఆడవాళ్లే మేలన్నారు జేసీ. రాజధాని కోసం మా ఆడవాళ్లు ముందుండి పోరాటం చేస్తున్నారని జేసీ చెప్పారు. రాజధాని ఉంటే అమరావతిలోనే ఉండాలని తేల్చి చెప్పిన జేసీ.. లేదంటే గ్రేటర్ రాయలసీమకు పిలుపునిస్తామన్నారు. జగన్ మొండిగా ముందుకెళ్తే.. జనవరి 23న హైదరాబాద్ లో రాయలసీమ నేతలంతా సమావేశం అవుతామని భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని జేసీ ప్రకటించారు. అమరావతిని రాజధాని చేయకపోతే రాయలసీమకు కడపను రాజధానిగా చేయాలని జేసీ కొత్త డిమాండ్ చేశారు.