JC Prabhakar Reddy..ED investigation : ఈడీ విచారణకు హాజరైన జేసీ ప్రభాకర్ రెడ్డి

టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అశ్విత్ రెడ్డిలు హాజరయ్యారు.

JC Prabhakar Reddy attended the ED investigation

JC Prabhakar Reddy  ED investigation : తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.శుక్ర‌వారం (అక్టోబర్ 7,2022) హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అశ్విత్ రెడ్డిలు హాజరయ్యారు. ఈడీ అధికారులు ఇద్దరిని ప్రశ్నిస్తున్నారు.

జేసీ ట్రావెల్స్ సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్-3 వాహనాలను బీఎస్-4 గా మార్చి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే జేసీ ట్రావెల్స్ పై కేసు నమోదు చేసిన ఈడీ..వారికి నోటీసులు జారీ చేసింది.ఈ క్రమంలో ఈడీ ఎదుట విచారణకు హాజరు అయ్యారు.కాగా ప్రభాకర్ రెడ్డితో సహా 23 మందిపై ఫోర్జరీ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

కాగా జూన్ నెలలో జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంలో శుక్రవారం ఉదయం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు నిర్వహించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసీ దివాకర్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యుల మొబైల్స్‌ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జేసీ సోదరుల సన్నిహితుడు చవ్వా గోపాల్ రెడ్డి నివాసంలో కూడా 20మంది ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.  వారి ఆస్తుల పత్రాలను పరిశీలించారు.