JC Prabhakar Reddy: మున్సిపల్ ఆఫీసులో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన

తెలుగుదేశం పార్టీ నాయకుడు, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jc Prabhakar Reddy

JC Prabhakar Reddy: తెలుగుదేశం పార్టీ నాయకుడు, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛైర్మన్ అయ్యాక కూడా తనకు సహకరించట్లేదంటూ ఆరోపిస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి, ఉదయం 11 గంటలకు అధికారులతో సమావేశం ఉన్నట్లుగా ముందుగానే అధికారులకు సమాచారం ఇచ్చారు.

అయితే, అంతకుముందే ఎమ్మెల్యే పెద్దారెడ్డితో కలిసి బయటికి వెళ్లిన అధికారులు సమావేశంకి గైర్హాజరయ్యారు. దీంతో అసహనానికి గురైన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆఫీస్ వద్దే బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. రాత్రికి కార్యాలయంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి ఉంటారని చెబుతున్నారు జేసీ అనుచరులు.