JC Prabhakar Reddy : అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ నేత,మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) తనదైన శైలిలో వైసీపీ ప్రభుత్వం (YCP Govt)పై సెటైర్లు వేశారు. జేసీ తనదైన స్టైల్లో స్పందన కార్యక్రమంలో తాను చేసిన ఫిర్యాదులపై స్పందించకపోతే కలెక్టర్ కాళ్లు పట్టుకుంటా అంటూ వ్యాఖ్యానించారు. ఇసుక అక్రమాల గురించి మాట్లాడుతు స్పందన కార్యక్రమంలో ఎటువంటి విషయాలు మాట్లాడినా స్పందనేఉండదు అంటూ సెటైర్లువేశారు. ఇసుక అక్రమాలపై స్పందన కార్యక్రమంలో మాట్లాడితే ఎటువంటి స్పందనా రాలేదంటూ సెటైర్లు వేశారు. ఫిర్యాదులపై స్పదన రానప్పుడు ఇక స్పందన కార్యక్రమం ఎందుకు? అంటూ ప్రశ్నించారు.
ఇసుక అక్రమాలపై ప్రశ్నిస్తే హౌస్ అరెస్ట్ చేస్తారని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇసుక అక్రమాలపై సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తే ఎటువంటి స్పందనా లేదంటూ ఇంకెందుకు మరి స్పందనలు అంటూ సెటైర్లు వేశారు. దేశంలోనే నెంబర్ వన్ మున్సిపాలిటీని నాశనం చేశారని ఇసుక అక్రమాలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా అమలు చేయటంలేదని ఆరోపించారు. తాను స్పందన కార్యక్రమంలో ఇసుక అక్రమాల గురించి చేసిన ఫిర్యాదులపై రెండు రోజుల్లో స్పందింకపోతే కలెక్టర్ కాళ్లు పట్టుకుంటానంటూ తెలిపారు జేసీ ప్రభాకర్ రెడ్డి.
కాగా తాడిపత్రి టౌన్ లో గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై జేసీ స్పందిస్తూ డీజల్ దొంగ ఎవరు? అని ఫ్లెక్సీలో రాసి ఉండటాన్ని చూపిస్తూ.. స్థానిక వైకాపా నాయకులపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. నేను ప్రజల మనసులు దోచుకున్న దొంగ అని చొక్కా విప్పి మరీ చూపించారు. తాడిపత్రి ప్రజలను తనను గుండెలో పెట్టుకున్నానని, తన గుండె తాడిపత్రి.. తాడిపత్రి.. అని కొట్టుకుంటుందన్నారు. కాగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి నుండి మండల స్థాయి అధికారుల వరకు అనుసంధానం చేస్తూ ప్రజల నుండి స్వీకరించే అర్జీలను ఆన్ లైనులో కంప్యూటరీకరించే కార్యక్రమమైన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘స్పందన’ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.