Jd Seelam: న్యూ ఇయర్ వేడుక తర్వాత షర్మిల కాంగ్రెస్‌లోకి..: కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం

రాజకీయ చదరంగం మారబోతుందని అన్నారు. అన్యాయాలు సహించలేని వారు కొందరు తమ పార్టీలోకి వస్తున్నారని తెలిపారు

Seelam-Sharmila

విజయవాడలో కాంగ్రెస్ పార్టీ పలు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి ఏపీలోని పరిస్థితులపై చర్చించింది. ఇందులో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ.. 40 సంఘాలతో సమాలోచన సమావేశం ఏర్పాటు చేశామని వివరించారు. న్యూ ఇయర్ వేడుక తర్వాత వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్‌లో చేరతారని అనుకుంటున్నామని చెప్పారు.

రాజకీయ చదరంగం మారబోతుందని జేడీ శీలం అన్నారు. అన్యాయాలు సహించలేని వారు కొందరు తమ పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. వారి పేర్లను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కాంగ్రెస్ లోకి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి వస్తే స్వాగతిస్తామని తెలిపారు.

బీజేపీకి మద్దతిస్తున్న పార్టీలను వ్యతిరేకిస్తూ ఇవాళ సమావేశం నిర్వహించినట్లు జేడీ శీలం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఉనికి లేకపోయినా ఆ పార్టీ పేరు మాత్రం మారుమోగుతోందని అన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు బీజేపీ తప్పిదాలు చేస్తున్నా వ్యతిరేకించడం లేదని చెప్పారు.

కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు హయాంలో ఏపీకి అన్యాయం జరుగుతోందని చెప్పారు. అన్యాయం జరుగుతున్నప్పటికీ ప్రాంతీయ పార్టీలు ఖండించలేదని అన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతేనని చెప్పారు. ఏపీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు.

తాము అధికారం వస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని అన్నారు. కాంగ్రెస్ లోకి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి వస్తే స్వాగతిస్తామని తెలిపారు. కాగా, సమాలోచన సమావేశంలో దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ, ప్రజా సంఘాల నేతలతో చర్చలు జరిగాయి. ఇందులో ఏపీ కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్రరాజు, వామపక్ష, ప్రజా సంఘాల నేతలు కూడా పాల్గొన్నారు.

Komatireddy Venkat Reddy : రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి ‘సలార్’ సాంగ్ చూశారా.. సోషల్ మీడియాలో వైరల్.. కాంగ్రెస్ శ్రేణులు ఫుల్ ఖుషీ..!