Jogi Ramesh - Chandrababu
Jogi Ramesh – YCP: టీడీపీపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రి జోగి రమేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ… ఏపీ ప్రజలకు వైసీపీ అందిస్తున్నది ప్రకాశించే నవరత్నాలు అని, దీనిపై టీడీపీ (TDP) నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
రాష్ట్రంలో సీఎం జగన్ చేస్తున్న సంక్షేమం గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారని చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలకు మాత్రం కళ్లకు కనపడడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడుకు దమ్ము, దైర్యం ఉంటే కుప్పం, టెక్కలి నియోజకవర్గంలో ఎక్కడైనా చర్చకు రావాలని ఆయన సవాలు విసిరారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో కుప్పం, టెక్కలిలో ఎవరెవరికి ఏమేం ఇచ్చారని జోగి రమేశ్ నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక తాము ఏం చేశామో చెబుతామని అన్నారు. జగన్ ఏం చేశారో, గతంలో చంద్రబాబు ఏం చేశాడో ప్రజలను అడుగుదామని సవాలు విసిరారు.
టీడీపీ నేతలకు దమ్ము ఉంటే ఈ ఛాలెంజ్ కి ఒప్పుకోవాలని ఆయన అన్నారు. కాగా, నవరత్నాలు అమలు చేస్తామని చెప్పిన జగన్ నవ మోసాలు చేశారంటూ టీడీపీ ఆరోపణలు చేస్తోంది. హామీల్లో 90 శాతం అమలు చేశామని వైసీపీ తప్పుడు ప్రచారం చేసుకుంటోందని టీడీపీ నేతలు అంటున్నారు.
మేము 90 శాతం హామీలను అమలు చేశాం అని వైసీపీ నేతలు చెప్పుకుంటారు. కానీ అన్నింటా జగన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పారు. 97 శాతం హామీలను నిబెట్టుకోలేకపోయారు. నవరత్నాల హామీల్లోనే 40లో 39 హామీలకు మడమ తిప్పేసి, ఒక్క హామీని మాత్రమే అమలుచేశారు. జగన్మోసపు రెడ్డి కనికట్టు అట్లుంటది.… pic.twitter.com/G4PKKZ0St8
— Telugu Desam Party (@JaiTDP) June 29, 2023