Jogi Ramesh On Chandrababu Health (Photo : Google)
Jogi Ramesh – Chandrababu Health : జైల్లో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు అంటూ టీడీపీ నేతలు చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి జోగి రమేశ్. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి ప్రజలెవరూ ఆందోళన చెందడం లేదన్నారాయన. చంద్రబాబు హెల్త్ కండీషన్ విషయంలో టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
డ్రామాలు ఆడుతున్నారు..
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి జోగి రమేశ్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ”అందరూ బాగుండాలి. చంద్రబాబు నాయుడు జైల్లో చక్కగా తినాలి, చక్కగా పడుకోవాలి. కావలసిన వసతులు జైలు శాఖ కల్పిస్తుంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదు. చంద్రబాబును చూసుకోవడానికి జైలు అధికారులు ఉన్నారు. ప్రభుత్వం మీద నిందలు వేసేందుకే ఈ ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి ప్రజలెవరూ ఆందోళన చెందటం లేదు. డ్రామా ఆర్టిస్టులే ఆందోళన పడి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దీన్ని ప్రజల నమ్మరు” అని మంత్రి జోగి రమేశ్ అన్నారు.
Also Read : ఏపీ సీఎం జగన్‌పై టాలీవుడ్ హీరో తీవ్ర విమర్శలు
చంద్రబాబుకి ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత:
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు బరువు తగ్గారని, స్కిన్ అలర్జీతో బాధపడుతున్నారని.. అయినా సరైన్ ట్రీట్ మెంట్ ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. చంద్రబాబును ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబుని అనారోగ్యం పాలు చేసేందుకు జైల్లో కుట్రలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబుకి ఏమైనా జరిగితే జగన్ సర్కార్ దే బాధ్యత అని హెచ్చరించారు.
అందుకే అలర్జీ..
73 సంవత్సరాల చంద్రబాబు డీహైడ్రేషన్, అలర్జీ సమస్యలతో బాధపడుతున్నారని టీడీపీ నేతలు వాపోయారు. కేవలం డెర్మటాలజీ చెకప్ చేయిస్తే చాలదని, బాడీ చెకప్ చేయాలని డిమాండ్ చేశారు. జైలు అధికారులు డాక్టర్లు చెప్పింది యథాతథంగా చెప్పటం లేదని, వివరాలు దాస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. జైల్లో అపరిశుభ్ర వాతావరణం, కలుషిత నీటి సరఫరా వల్లే చంద్రబాబుకు అలర్జీ వచ్చిందన్నారు.
Also Read : మోదీ, జగన్ కలిసే ఆ పని చేస్తున్నారు : అరుణ్ కుమార్
మేము వస్తే.. వైసీపీ నాయకులు బయట తిరగలేరు, అన్నం తినలేరు..
సజ్జల ఒకలా, జైళ్ల డీఐజీ ఒకలా, మంత్రులు ఒకలాగా మాట్లాడడం సబబుకాదన్నారు. డీ హైడ్రేషన్ తో చంద్రబాబు గారు అస్వస్థతకు గురికావడంతో కోట్లాదిమంది తెలుగు ప్రజలు తల్లడిల్లుతుంటే వైసీపీ నాయకులకు నవ్వులాటగా ఉందని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నాము కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు, ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారు. అన్ని సమయాలు ఇలాగే ఉండవు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వైసీపీ నాయకులు బయట తిరిగే పరిస్థితి ఉండదు. వైసీపీ వారు అన్నం తినే పరిస్థితులు కూడా ఉండవు. వైసీపీ నాయకులు బతికున్నంత కాలం చిప్ప కూడు తినాల్సిందే అని టీడీపీ నేతలు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.