Romantic Movie Poster: ఏపీలో పూరీ సినిమాపై న్యాయమూర్తి ఆగ్రహం.. పోస్టర్‌పై వైట్ పేపర్!

పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా కొత్త హీరోయిన్ కేతిక శర్మ హీరోయిన్‌గా లేటెస్ట్ థియేటర్లలోకి వచ్చిన లవ్ డ్రామా ‘రొమాంటిక్’.

Romantic

Romantic Movie Poster: పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా కొత్త హీరోయిన్ కేతిక శర్మ హీరోయిన్‌గా లేటెస్ట్ థియేటర్లలోకి వచ్చిన లవ్ డ్రామా ‘రొమాంటిక్’ సినిమా. ఈ సినిమా పోస్టర్లు చూడడానికి చాలా ఇబ్బందిగా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కడప జిల్లా రాయచోటి 5వ అదనపు జిల్లా జడ్జ్.

ఈ సినిమా అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలవగా.. రాయచోటిలోని ఓ హాలులో కూడా విడుదలైంది. ప్రమోషన్‌లో భాగంగా సినిమా పోస్టర్‌లను పట్టణమంతా అంటించారు. అయితే, ఆ పోస్టర్‌లలో హీరోహీరోయిన్లకు సంబంధించి చాలా రొమాంటిక్‌గా ఉండే పోస్టర్‌లు ఎక్కువగా గోడలపై కనిపించాయి.

కోర్టుకు వెళ్లే సమయంలో దారిలో ఈ పోస్టర్లను గమనించి రాయచోటి ఐదవ అదనపు జిల్లా జడ్జ్ ఎస్‌ఎండీ లక్ష్మి, కోర్టు నుంచి అమీనాను థియేటర్‌ యజమాని వద్దకు పంపించి యువతను పెడదోవ పట్టిస్తున్న పోస్టర్లను వెంటనే తొలగించాలని, లేనిపక్షంలో క్రిమినల్‌ చర్యలు చేపట్టాల్సి వస్తుందని ఆదేశించారు. దీంతో రొమాంటిక్‌ సినిమా పోస్టర్లపై వైట్‌ పేపర్‌ అతికించారు థియేటర్ యాజమాన్యం.