Nandyala Jungle Safari : ప్రకృతి ప్రేమికులకు శుభవార్త.. నల్లమలలో కొత్త జంగిల్ సఫారీ ప్రారంభం

Nandyala Jungle Safari : నల్లమల అటవీ ప్రాంతంలోని ప్రకృతి అందాలను ప్రకృతి ప్రేమికులకు మరింత చేరువ చేసేందుకు నంద్యాల జిల్లాలో మరో జంగిల్ సఫారీ అందుబాటులోకి రానుంది.

Nandyala Jungle Safari

Nandyala Jungle Safari : నల్లమల అటవీ ప్రాంతంలోని ప్రకృతి అందాలను ప్రకృతి ప్రేమికులకు మరింత చేరువ చేసేందుకు నంద్యాల జిల్లాలో మరో జంగిల్ సఫారీ అందుబాటులోకి రానుంది. వెలుగోడు అటవీ రేంజ్ పరిధిలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన వెలుగోడు జంగిల్ సఫారీని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.

Also Read : Abhijit Deepke : మా అమ్మాయిని చేసుకోండి.. లేదు లేదు.. మా అమ్మాయినే..! అభిజిత్ దీప్కేతో పెళ్లికి క్యూ..

ఈ జంగిల్ సఫారీ మార్గం వైఎస్సార్ స్మృతివనం నుంచి ప్రారంభమై, నల్లమల అడవుల్లో దాదాపు 18 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. ఈ సఫారీ ద్వారా పర్యాటకులు నల్లమల అటవీ అందాలు, వన్యప్రాణులు, సహజ ప్రకృతి వైభవాన్ని దగ్గరగా వీక్షించే అవకాశం లభించనుంది.

జంగిల్ సఫారీ కోసం ఆరుగురు సభ్యులతో కూడిన బృందానికి రూ.2,000 ఫీజును అటవీ శాఖ నిర్ణయించింది. అలాగే గైడ్ సేవలకు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఆరుగురికి మించి అదనంగా వచ్చే ప్రతి వ్యక్తికి రూ.500 చొప్పున రుసుము వసూలు చేయనున్నారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు నల్లమల అటవీ ప్రాంతాన్ని మరింత మంది సందర్శకులకు పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ జంగిల్ సఫారీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.