Jyothula Nehru Resign
Jyothula Nehru Resign : పరిషత్ ఎన్నికల బహిష్కరణపై టీడీపీలో అభిప్రాయభేదాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు నేతలు చంద్రబాబు నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రూ రాజీనామా చేశారు.
పరిషత్ ఎన్నికలను చంద్రబాబు బహిష్కరించనుందుకు తాను రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. చంద్రబాబు నిర్ణయం తనను, కార్యకర్తలను బాధపెట్టిందని జ్యోతుల చెప్పారు. జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గా కొనసాగుతానని జ్యోతుల వెల్లడించారు.
మరోవైపు పార్టీ నిర్ణయానికి భిన్నంగా స్పందించారు అశోక్ గజపతిరాజు. పరిషత్ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై వ్యతిరేకత వచ్చిందన్నారు. టీడీపీ అభ్యర్థుల పోటీపై కేడర్ అభిప్రాయం తీసుకోవాల్సిందని చెప్పారు. టీడీపీ ఒక సిద్ధాంతంతో పనిచేస్తున్న రాజకీయ పార్టీగా ఆశోక్ గజపతిరాజు పేర్కొన్నారు.
పోటీలో గెలిచినా, గెలవకపోయినా సిద్ధాంతాలు వదులుకోకూడదన్నారు. నిజమైన కార్యకర్తలకు కొన్ని ఇబ్బందులు తప్పవని తెలిపారు. స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు.