Kakani
Kakani: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై అధికార పార్టీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్దన్ రెడ్డి కామెంట్లు చేశారు. ఎంపీ రఘురామ కృష్ణం రాజును, చంద్రబాబు నాయుడిని విమర్శించారు. జగన్ బొమ్మ పెట్టుకుని టీడీపీ పై గెలిచిన వ్యక్తిని చంద్రబాబు నాయుడు నెత్తిన పెట్టుకోవడం సిగ్గుచేటని అన్నారు.
రాష్ర్రంలో దొంగ ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబుదే. రఘురామ కృష్ణంరాజుని టీడీపీ ఎందుకు వెనకవేసుకొస్తుంది. చంద్రబాబుకి మానస పుత్రుడు ఎలా అయ్యాడు. సీబీఐ కుడా రఘురామ కృష్ణంరాజు పై కేసులు నమోదు చేసింది కదా. వాళ్ల మీద కూడా కేసు వేయగలరా.. అని ప్రశ్నించారు.
అభివృద్ధి, వసతుల కోసం నిధులు కేటాయిస్తున్నాం. పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నాం. రాష్ట్రంలో 30లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. జిల్లాలో 1.90 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం చేస్తుంటే టీడీపీ అనవసరమైన రాద్ధాంతం చేస్తోంది. విజయదశమి లోపల అందరికి ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పుకొచ్చారు.