Kakani Govardhan Reddy: జిల్లా యంత్రాంగంతో చర్చించి చెప్తాం.. టీడీపీ అనవసర రాద్ధాంతమే

ఆంధ్రప్రదేశ్ లో కీలకంగా మారిన ఆనందయ్య మందు పంపిణీపై వస్తున్న రూమర్లను కొట్టిపారేశారు ఎమ్మల్యే. పంపిణీ సక్రమంగానే జరుగుతుందని వివరించిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తున్నామని అన్నారు.

Kakani Govardhan Reddy: ఆంధ్రప్రదేశ్ లో కీలకంగా మారిన ఆనందయ్య మందు పంపిణీపై వస్తున్న రూమర్లను కొట్టిపారేశారు ఎమ్మల్యే. పంపిణీ సక్రమంగానే జరుగుతుందని వివరించిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తున్నామని అన్నారు.

‘ఆనందయ్య అందరికీ మందు పంపిణీ చేసేందుకు సిద్ధమేనని ప్రకటించారు. అతనికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ఏ రకమైన సహకారం కోరుతున్నారో జిల్లా యంత్రాంగంతో చర్చించిన తర్వాత కార్యాచరణను తెలియజేస్తున్నాం.

అందరికీ పంపిణీ చేస్తున్న మందు.. సామాన్యులకు అందడం లేదని వచ్చే విమర్శల్లో వాస్తవం లేదు. ఇలాంటి విమర్శల వెనుక ఎవరైనా ఉన్నారేమోనని ఆలోచించాల్సిన అవసరముంది. ఇప్పటివరకు ఆనందయ్య ఎలాంటి లాభాపేక్షలేకుండా మందు పంపిణీ చేశారు.

వైసిపి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయింది. స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారిగా జిల్లాలో 10 కి 10 స్థానాలు గెలుచుకున్నాం. వచ్చే ఎన్నికల్లో 151 కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తాం. మ్యానిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలను అమలు చేస్తున్నాం. సీఎం జగన్ మ్యానిఫెస్టోని పవిత్ర గ్రంథంగా భావించి అమలు చేస్తున్నాం.

ప్రతిపక్ష టీడీపీ అనవసర రాద్ధాంతం తప్ప.. నిర్మాణాత్మక పాత్ర పోషించలేదు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమి పాలైంది. గ్రామ సచివాలయాలతో పాలనలో కొత్త ఒరవడి మొదలైంది. అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు