AE Nookaraju Family Case : సాధిక్‌ఖాన్‌ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి.. ప్రొటీన్ పౌడర్‌లో సైనైడ్ కలిపి.. గడ్డం తీసేసి..

AE Nookaraju Family Case : కాకినాడలో పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు కేసులో సంచలన విషయాల వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు సాధిక్ ఖాన్ ను పోలీసులు విచారిస్తున్నారు.

AE Nookaraju family Suicide Case

AE Nookaraju Family Case : కాకినాడలో పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో పోలీసుల విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈ ఘటనలో నిందితుడు షేక్ సాధిక్ ఖాన్ ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో సాధిక్ ఖాన్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

Also Read : Weather Forecast Today : ఏపీకి వెదర్ అలర్ట్.. దంచికొట్టనున్న వానలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్!

తనకన్నా పదేళ్లు పెద్ద వయసున్న, వివాహిత అయిన సౌజన్యను మాటలతో మభ్యపెట్టి సాధిక్ ఖాన్ దగ్గరయ్యాడు. ఆమె ప్రైవేట్ వీడియోలు, సంభాషణలతో బ్లాక్ మెయిల్ చేసి కుటుంబం మొత్తం ప్రాణాలు తీసుకునేందుకు కారణమయ్యాడు. అయితే, సౌజన్య చనిపోయే ముందు లేఖలో పేర్కొన్నట్లుగా.. ఆమె భర్త జగదీశ్ రెడ్డి మరణంలోనూ సాధిక్ ఖాన్ పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు.

సౌజన్య భర్త జగదీశ్ రెడ్డి నరాల సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో హైదరాబాద్ లోని ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. అప్పటికే సౌజన్యతో సాధిక్ సన్నిహితంగా మెలిగేవాడు. సౌజన్య కుటుంబం ఆస్తిపై కన్నేసిన సాధిక్.. జగదీశ్వరరెడ్డిని హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన మరుసటి రోజే జగదీశ్వర్ రెడ్డికి ప్రొటీన్ పౌడర్ లో సైనైడ్ కలిపి ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ సైనైడ్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆరాతీయగా.. ఓ బంగారం వ్యాపారి నుంచి దానిని కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ప్రొటీన్ పౌడర్లో  సైనైడ్‌ను సాధిక్ నేరుగా కలిపాడా..? సౌజన్య లేదంటే వేరే వ్యక్తులు ఎవరైనా అతనికి సహరించారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Also Read : Kovvuri Soujanya Death Note : సౌజన్య మరణ వాంగ్మూలం.. సాదిక్‌పై సంచలన ఆరోపణలు.. 5 పేజీలో లేఖలో ఏముంది?

నూకరాజు కుటుంబం ఆత్మహత్య అనంతరం సాధిక్ ఖాన్ పరారయ్యాడు. అయితే, తనను ఎవరూ గుర్తుపట్టకుండా గడ్డం తీసేశాడు. పరారీలో అతడికి సాయపడిన వారంతా గతంలో సాధిక్ తో పాటు షూటింగ్ లో శిక్షణ పొందిన వారుగా పోలీసులు గుర్తించారు. జగదీశ్వరరెడ్డి మృతి తరువాత అతని కుమారుడు రియాన్ష్ కార్తికేయ రెడ్డి పేరిట లీగల్ హెయిర్ సర్టిఫికెట్ తీసుకోవాలని సాదిక్ ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాక.. సౌజన్యను పెండ్లి చేసుకొని.. వారి కుటుంబం ఆస్తులన్నీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని కూడా సాధిక్ ప్లాన్ చేసినట్లు.. నూకరాజు పేరిట ఉన్న ఓ స్థలాన్నిసైతం అమ్మాలని ప్రయత్నించినట్లు తెలిసింది.

ఇదిలాఉంటే.. జగదీశ్వరరెడ్డి హత్య ఘటనలో తన కోడలు సౌజన్య ప్రమేయం కూడా ఉందని ఆయన తండ్రి ఆరోపించారు. నా కుమారుడు జగదీశ్వరరెడ్డిని విషయప్రయోగం చేసి సాధిక్ ఖాన్ హత్య చేశాడు.. అతనికి మా కోడలు సౌజన్య సహకరించిందని ఆరోపించాడు. మనవడు రియాన్ష్ రెడ్డిని తనకు అప్పగించాలని పోలీసులను కోరాడు. ఇదిలాఉంటే.. ఈ ఘటనపై పోలీసుల విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. విచారణ క్రమంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.