Weather Forecast Today : ఏపీకి వెదర్ అలర్ట్.. దంచికొట్టనున్న వానలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్!
Weather Forecast Today : ఆంధ్రప్రదేశ్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ అయింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడనున్నాయి.
Weather Forecast Today
- ఆంధ్రప్రదేశ్లో వర్షాల జోరు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
- ఈ జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు
- బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
Weather Forecast Today : తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం ఏపీపై పడింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి.
అమరావతి వాతావరణ కేంద్రం లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం.. ఆగస్టు 24 నుంచి రానున్న రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్–యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. అలాగే, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది.
వర్షాలే కాదు.. మెరుపులు, ఉరుములు గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అల్పపీడన ప్రభావంతో చక్రవాత ఆవర్తనం ప్రభావంతో వాతావరణ పరిస్థితులు మరింత చురుగ్గా మారిపోతున్నాయి.
వాతావరణ శాఖ ప్రకారం.. :
పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్, వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడన ప్రాంతంగా నమోదైంది. గంగా తీర పశ్చిమ బెంగాల్ సమీపంలోని జార్ఖండ్, ఉత్తర ఒడిశా ప్రాంతాలపై అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది.
మన్యం, పార్వతీపురం విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, కర్నూలు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో రాబోయే కొద్ది గంటల్లో పలు చోట్ల చోట్ల భారీ వర్షాలతో పాటు మెరుపులు, ఈదురుగాలులు పడే ఛాన్స్ కనిపిస్తోంది.
ముందు జాగ్రత్త చర్యగా వాతావరణ శాఖ ఈ ప్రాంత జిల్లాల ప్రజలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. వర్షాలు పడే సమయంలో ఎవరూ బయటకు రావొద్దని, చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. అలాగే, ఉరుములు, మెరుపుల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని కూడా హెచ్చరిస్తోంది.
