AP CM YS Jagan: చదువు ఉంటేనే పేదరికం నుంచి బయటపడగలం.. కల్యాణమస్తు, షాదీతోఫా నిధులు విడుదల చేసిన జగన్ ..

జగనన్న అమ్మఒడి ఒక ప్రోత్సాహకంగా నిలిస్తే, రెండో ప్రోత్సాహకంగా జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ఉంటుంది. ఇక మూడో ప్రోత్సాహకంగా కళ్యాణమస్తు, షాదీ తోఫా నిలుస్తుందని సీఎం జగన్ అన్నారు.

AP CM YS Jagan: చదువు ఉంటేనే మెరుగైన ఉద్యోగాలు వస్తాయి, అప్పుడే పేదరికం నుంచి బయటకు వస్తాం అని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల వారికి ప్రభుత్వ ఫలాలు అందిస్తోందని జగన్ తెలిపారు. వైయస్సార్‌ కల్యాణ మస్తు, వైయస్సార్‌ షాదీతోఫా కింద లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బు జమ చేసే కార్యక్రమాన్ని సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా బటన్ నొక్కి విడుదల చేశారు. తద్వారా.. జనవరి- మార్చి త్రైమాసికంలో వివాహాలు చేసుకున్న 12,132 మంది లబ్ధిదారులకు వైయస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద రూ. 87.32 కోట్ల ఆర్థిక సహాయం అందించారు.

CM Jagan : మోదీ ప్రాపకం లేకపోతే బయటపడలేమని బాబు భయం

ఈ సందర్భంగా సీఎం జగన్‌మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. వివాహాలు చేసుకున్న పేదలకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. ఆర్థికంగా ఆదుకోవడం ఒక్కటే కాకుండా, ఇలా చేయడం ద్వారా పదోతరగతి కచ్చితంగా చదివి ఉండాలని నిబంధన తీసుకు వచ్చామని అన్నారు. అప్పుడే కళ్యాణమస్తు, షాదీతోఫాలు వర్తిస్తాయని స్పష్టంగా చెప్పామని జగన్ అన్నారు. దీనివల్ల పదోతరగతి వరకూ చదివించాలన్న తపన ప్రతి పేద కుటుంబంలో కూడా మొదలవుతుందని జగన్ తెలిపారు. పెళ్లి చేసుకోవాలంటే ఆడపిల్లకు 18 ఏళ్లు ఉండాలి, అబ్బాయికి కచ్చితంగా 21 సంవత్సరాలు ఉండాలన్న నిబంధన పెట్టాం. పదోతరగతి అయ్యేసరికి అమ్మాయికి 15 ఏళ్లు నిండుతుంది. ఆతర్వాత వివాహంకోసం మరో మూడేళ్లు ఆగాల్సి వస్తుంది. అందువల్ల నేరుగా ఇంటర్మీయడిట్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది. ఎలాగూ మనం అమ్మ ఒడి ఇస్తున్నాం. ఇంటర్మీడియట్‌ అయ్యాక.. ఫీజు రియింబర్స్‌మెంట్‌ వర్తింపచేస్తున్నాం. జగనన్న వసతి దీవెనకూడా డిగ్రీ విద్యార్థులకు ఇస్తున్నాం. దీనిద్వారా ప్రతి పిల్లాడు కూడా కనీసం డిగ్రీ వరకూ చదివే కార్యక్రమానికి అడుగులు పడతాన్నాయని సీఎం జగన్ అన్నారు.

Karumuri Nageswara Rao : చంద్రబాబు జైలుకు వెళ్ళడం ఖాయం : మంత్రి కారుమూరి

జగనన్న అమ్మఒడి ఒక ప్రోత్సాహకంగా నిలిస్తే, రెండో ప్రోత్సాహకంగా జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ఉంటుంది. ఇక మూడో ప్రోత్సాహకంగా కళ్యాణమస్తు, షాదీ తోఫా నిలుస్తుందని సీఎం జగన్ అన్నారు. పేదరికం పోవాలంటే ఒకేఒక్క మార్గం చదువులు మాత్రమే. చదువులు ఉంటేనే.. మెరుగైన ఉద్యోగాలు వస్తాయి. అప్పుడే పేదరికం నుంచి బయటకు వస్తాం. ఇవాళ లబ్ధిదారులైన వారిలో దాదాపు 6వేల జంటలు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన అందుకుంటున్నాయి. ఇంతకుముందు ప్రభుత్వం ఎన్నికలకోసం చేశామంటే.. చేశాం అన్నట్టుగా చేసింది. 17,709 మంది జంటలకు దాదాపు రూ.70కోట్లు ఎగ్గొట్టింది. ఇచ్చేది తక్కువే అయినా డబ్బులు ఎగరగొట్టారంటూ గత టీడీపీ ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేశారు.

Karnataka Elections: ప్రధాని ‘జై బజరంగ్ బలి’ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌నూ వదల్లేదు..

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బీసీ సోదరులకు మంచి జరగాలని ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ఎస్సీలకు గతంలో 40 వేలు ఇస్తామని చెప్పి.. ఇవ్వలేదు. మనం ఎస్సీలకు లక్ష రూపాయలు అందిస్తున్నాం. ఎస్టీలకు గతంలో రూ. 50వేల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ డబ్బుకూడా ఇవ్వలేదు. మనం వీరికి రూ.లక్ష రూపాయలకు పెంచాం. బీసీలకు గతంలో రూ.35వేలు రూపాయలు ఇస్తామని చెప్పి ఎగ్గొట్టారు. మనం వీరికి రూ.50వేలకు పెంచాం. అలాగే విభిన్న ప్రతిభావంతులకైతే లక్షన్నర వరకూ పెంచాం. ఇలా ప్రతి కేటగిరీలో కూడా ఇచ్చే డబ్బును పెంచామని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

ట్రెండింగ్ వార్తలు