Kamadhenu Puja -AP govt : ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గోపూజా మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జగన్ ప్రభుత్వం రెడీ అయ్యింది. గుంటూరు జిల్లా నరసారావుపేట మున్సిపల్ స్టేడియంలో జరగనున్న గోపూజ మహోత్సవంలో స్వయంగా సీఎం జగన్ పాల్గొననున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 2వేల 679 ఆలయాల్లో ఈ పూజా కార్యక్రమాలు జరగనున్నాయి.
ఉదయం పదిన్నరకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. 11 గంటల 25 నిమిషాలకు నరసరావుపేట మున్సిపల్ స్టేడియం చేరుకోనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించి అనంతరం గోపూజా కార్యక్రమంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటా 10 నిమిషాలకు తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు. గోపూజ మహోత్సవ కార్యక్రమానికి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లను మంత్రులు, అధికారులు స్వయంగా పరిశీలించారు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.