Durga Temple
Durga Temple – Vijayawada: విజయవాడ దుర్గగుడి పాలకమండలి ఇవాళ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. అనంతరం దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు (Karnati Rambabu) మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు.
దుర్గగుడిలో పనిచేసే ఎన్ఎమ్ఆర్, కాంట్రాక్టు తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం తీర్మానం చేసి సర్కారుకు, దేవాదాయ శాఖ కమిషనర్ కు పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 300 రూపాయల దర్శనానికి ఉచితంగా ఒక లడ్డూ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
నేను మీకు సహాయ పడతాను అనే పదంతో భక్తులకు ఉపయోగ పడే విధంగా టోల్ ఫ్రీ నంబర్ 18004259099 అందుబాటులోకి తెచ్చామని వివరించారు. పెళ్లిళ్ల శుభకార్యాలకు అమ్మవారికి మొదటి శుభలేఖ ఇచ్చే వారికి ఆశీర్వచనంతో పాటు అక్షింతలు, కుంకుమ ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. సీవీ రెడ్డి ఛారిటీస్ లో పేదవారి కోసం హాస్పిటల్ నిర్మించి వైద్య సేవలందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Jogi Ramesh: చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడుకు దమ్ము, దైర్యం ఉంటే అక్కడకు రావాలి: మంత్రి జోగి రమేశ్