JanaSena: ఇక భరించలేనంటూ జనసేనకు రాజీనామా చేసి.. 24 గంటల్లోనే వైసీపీలో చేరిన కీలక నేత

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యల పట్ల ఆకర్షితుడినై ఆ పార్టీలో చేరానని అప్పట్లో అన్నారు. ఇప్పుడు జనసేనలో అవమానాలు భరించలేక...

Kethamreddy Vinod Reddy

Kethamreddy Vinod Reddy: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సిద్ధవుతున్న జనసేనకు ఆ పార్టీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే ఆశావాహ అభ్యర్థి, కీలక నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి షాక్ ఇచ్చారు. ఇక అవమానాలు భరించలేనంటూ జనసేనకు రాజీనామా చేసిన 24 గంటల్లోనే వైసీపీలో చేరారు. ఆయనకు ఎంపీ విజయసాయి రెడ్డి తమ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేతంరెడ్డి వినోద్ రెడ్డి మద్దతుదారులు కూడా వైసీపీలో చేరారు.

వైసీపీ ఇవాళ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ చేరికలు జరిగాయి. కాగా, గురువారమే జనసేనకు కేతంరెడ్డి వినోద్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ఓ లేఖ రాస్తూ.. తాను కాంగ్రెస్ లో పనిచేశానని, ఆ తర్వాత యువతకు ప్రాధాన్యం కల్పిస్తానన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యల పట్ల ఆకర్షితుడినై ఆ పార్టీలో చేరానని అన్నారు.

నెల్లూరు సిటీలో తాను చేసిన పనిని గుర్తించిన పవన్ గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చారని చెప్పారు. తాను ఓడినప్పటికీ ఏనాడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని, జనసేన పార్టీ పరంగా అంతర్గతంగా తాను ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని అన్నారు. తగిన విలువ ఇవ్వకుండా తాను ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నా పంటి బిగువున భరించానని అన్నారు.

మాజీ మంత్రి నారాయణను నెల్లూరు సిటీ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించిందని, అప్పుడు టీడీపీ-జనసేనకు మధ్య పొత్తు లేదని చెప్పారు. అయినప్పటికీ సీటుని తానేం ఆశించలేదని చెప్పుకొచ్చారు.

Ponnala Lakshmaiah : పదవుల కోసం కాదు అవమానాలు భరించలేకే రాజీనామా చేశా : పొన్నాల లక్ష్మయ్య